Breaking News

అయ్యన్న బూతు పురాణం

Published on Mon, 08/25/2025 - 04:11

అసెంబ్లీ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు మరోసారి బూతు పురాణం విప్పారు. అనకాపల్లి జిల్లా రావికమతం మండలం దొండపూడిలో ప్రొటోకాల్‌ తెలియదా అంటూ పోలీసులను ఉద్దేశించి రెచ్చిపోయారు. నేను వస్తున్నానంటే కూడా మీకు లెక్కలేదా అంటూ బూతులు లంకించుకున్నారు. ఈ  దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

రావికమతం: అసెంబ్లీ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు మరోసారి బూతు పురాణం విప్పారు. మేమొస్తుంటే మీరేం చేస్తున్నారంటూ పోలీసులపై నోటికొచ్చినట్లు మాట్లాడుతూ రెచ్చిపోయారు. ప్రొటోకాల్‌ తెలియదా అంటూ పోలీసులను ఉద్దేశించి పత్రికల్లో రాయలేని భాషలో విరుచుకుపడ్డారు.  అయ్యన్న రెచ్చిపోయిన తీరుకు సంబంధించిన వీడియో  సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది.  

వివరాల్లోకి వెళితే.. అనకాపల్లి జిల్లా రావికమతం మండలం దొండపూడిలో ఈ నెల 21న గ్రామ దేవత శ్రీదుర్గాలమ్మ పండుగ భారీ ఎత్తున జరిగింది. నిర్వాహకుల ఆహ్వానం మేరకు వివిధ ప్రాంతాల నుంచి .. వివిధ పార్టీలకు చెందిన దాదాపు  25 మంది  ఎమ్మెల్యేలు, నేతలు హాజరయ్యారు. వేలాది మంది భక్తుల రాకతో గ్రామంలో విపరీతమైన రద్దీ నెలకొనడంతో సీఐ, ఎస్‌ఐ సహా పోలీసులంతా బందోబస్తులో నిమగ్నమయ్యారు. 

అదే సమయంలో అమ్మవారి దర్శనానికి పెద్ద ఎత్తున అనుచరులను వెంట బెట్టుకుని అయ్యన్న వచ్చారు. వచ్చీ రాగానే.. పోలీసులెక్కడ.. అని ప్రశ్నిస్తూ నోటికి పని చెప్పారు. పోలీసు అధికారులెవరూ తన వద్దకు రాలేదని ఆగ్రహించారు. ‘మేమొస్తుంటే సీఐ, ఎస్‌ఐ ఏం చేస్తున్నారు?   తమాషాలు చేస్తున్నారా?.. నేను వచ్చినా కూడా ఇక్కడకు రారా..’ అంటూ బండబూతులతో  రెచ్చిపోయారు. 

అయ్యన్న పోలీసులను తిడుతుంటే ఆయన అనుచరులు పెద్ద ఎత్తున మద్దతుగా కేకలు వేశారు. ఆ పక్కనే ఉన్న పోలీసులు అక్కడికి వచ్చి.. ‘సార్‌.. మేమిక్కడే ఉన్నామని చెబుతున్నా ఆయన వినిపించుకోలేదు. దీంతో పోలీసులు  చిన్నబు­చ్చుకున్నారు.

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)