Breaking News

ఏపీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు నామినేషన్‌

Published on Fri, 06/21/2024 - 13:47

అమరావతి, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌గా టీడీపీ సీనియర్‌ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు నామినేషన్‌ వేశారు. శుక్రవారం ఉదయం ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన అనంతరం అయ్యన్న తరపున కూటమి నేతలు నామినేషన్‌ సమర్పించారు. ఈ కార్యక్రమంలో కూటమి మంత్రులు పవన్‌, నారా లోకేష్‌, ఇతరులు పాల్గొన్నారు.

ఏపీ అసెంబ్లీలో ఇవాళ 172 మంది ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ప్రొటెం స్పీకర్‌ గోరంట్ల బుచ్చయ్య చౌదరి నాలుగు పార్టీల ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించారు. ఇక రేపు మిగిలిన ముగ్గురు సభ్యులు ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయనున్నారు. ఆ తర్వాత స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక జరగనుంది. స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 

ఇక డిప్యూటీ స్పీకర్‌ పోస్ట్‌ జనసేన లేదంటే బీజేపీకి వెళ్లే అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాలు వినిపించినప్పటికీ.. టీడీపీనే ఆ పోస్ట్‌ దక్కించుకునే అవకాశాలు ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నాయి. డిప్యూటీ స్పీకర్‌ బదులు జనసేనకు విప్‌ పోస్ట్‌తో సరిపెట్టవచ్చని సమాచారం.

అయ్యన్నపాత్రుడి కామెంట్స్‌.. 
చంద్రబాబు , పవన్, బీజేపీ నేతలు నన్ను స్పీకర్ గా నామినేట్ చేశారు. నామినేషన్ వేశాను. సాయంత్రం వరకు నామినేషన్ గడువు ఉంది..ఇంకా ఎవరైనా వేస్తారేమో వేచి చూడాలి. స్పీకర్ గా ఎన్నిక కావడం సంతోషం గా ఉంది. గతంలో ఎమ్మెల్యే గా, మంత్రిగా, ఎంపీ గా పని చేశాను. స్పీకర్ గా కుర్చీలో కూర్చున్న తరువుతా పార్టీ గుర్తు రాకూడదు. గౌరవ సభ్యులకు కూడా ప్రాధాన్యత ఇస్తాను. మాట్లాడేందుకు సమయం ఇస్తాను.

జనసేనకు కీలక పదవి

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)