Breaking News

వైజాగ్‌కి వైన్‌ కోసం వస్తారు..

Published on Tue, 01/28/2025 - 09:42

సాక్షి, విశాఖపట్నం: పర్యాటకులు వైజాగ్‌కు వైన్‌ తాగడానికి రాకపోతే.. కాఫీ తాగడానికి వస్తారా అంటూ అసెంబ్లీ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యా­నించారు. వైజాగ్‌ బీచ్‌కు వచ్చేది టీ, కాఫీలు తాగడానికి కాదని, ఎంజాయ్‌ చెయ్యడా­నికని చెప్పారు. సోమవారం ఇక్కడ జరిగిన టూరిజం ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో ఆయన మాట్లాడుతూ.. జర్మనీ తరహాలో బీచ్‌లో చిన్న హట్స్‌ ఏర్పాటు చేసి టిఫిన్స్, బీరు, డ్రింక్‌ ఇచ్చేలా ఏర్పాట్లు చెయ్యాలన్నారు. మద్యం విరివిగా లభించేలా పాలసీలు తీసుకొస్తేనే డెవలప్‌మెంట్‌ ఉంటుందని అన్నారు. గోవా, బెంగళూరుతో పోలిస్తే వైజాగ్‌ని ఎందుకు అభివృద్ధి చెయ్యలేకపోతున్నామో ఆలోచించాలన్నారు. 

టూరిస్ట్‌కి ఎంటర్‌టైన్‌మెంట్‌ కావాలని, ఆ ఎంజాయ్‌మెంట్‌ ఇక్క­డ ఇవ్వగలరా అని ప్రశ్నించారు. ఇద్దరు కూర్చుంటే పోలీసులు కేసులు పెట్టేస్తారని అన్నారు. నిబంధనల పేరుతో నియంత్రణ పెడితే పర్యాటకులు రారని చెప్పారు. రూల్స్‌ అవసరమే కానీ, వెసులుబాట్లు ఉండాలని, ముఖ్యంగా టూరి­జానికి మినహాయింపులు ఇవ్వా­లని అన్నారు. ప్రకృతి వనరులు ఉన్నా పర్యాటకాభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగడంలేదని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి లంబసింగికి పర్యాటకులు వస్తున్నా కనీస వసతులు లేవని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో పెట్టుబడులకు స్థానికులు ఉండాలనే నిబంధనకు పరిష్కారం చూడాలన్నారు. 

గిరిజనులు కోట్ల  రూపాయలు పెట్టుబడులు పెట్టగలరా అని అన్నారు. ట్రైబల్‌ యాక్ట్‌లో మార్పులు చెయ్యా­లని చెప్పారు. ఎవరైనా పెట్టుబడికి పర్మిషన్ కోసం వస్తే యస్‌ ఆర్‌ నో అని చెప్పడానికి అధికారులు 6 నెలలు, సంవత్సరం ఎందుకు తిప్పుతున్నారని ప్రశి్న­ంచారు. అనంతరం డిప్యూటీ సీఎం వివాదంపై మీడియా ప్రతినిధుల ప్రశ్నకు అయ్యన్న స్పందిస్తూ.. ఒకరిని డిప్యూటీ సీఎంని చేయాలని అడగడానికి రాజకీయ నాయకులు ఎవరని ప్రశి్నంచారు. అది ప్రజలు నిర్ణయించాలని అన్నారు.

ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు వివాదాస్పద వ్యాఖ్యలు


 

Videos

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)