Breaking News

మాజీ మంత్రి విడదల రజినీపై దాడికి యత్నం

Published on Fri, 01/30/2026 - 18:52

బోయపాలెం: మాజీ మంత్రి విడదల రజినీపై టీడీపీ గూండాలు దాడికి యత్నించారు. పల్నాడు జిల్లాలోని బోయపాలెంలో టీడీపీ గూండాలు నానా హంగామా చేసి విడదల రజినీపై దాడి చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. తిరుమల లడ్డూపై టీడీపీ విష ప్రచారాన్ని నిరసిస్తూ విడదల రజినీ ఓ గుడిలో పూజలు చేశారు. 

అయితే విడదల రజినీ పూజలు చేస్తుండగా టీడీపీ గూండాలు.. గుడి బయట హల్‌చల్‌ సృష్టించారు. గుడి బయట నానా హంగామా చేసి.. పూజను అడ్డుకోవడానికి యత్నించారు.  దీనిలో భాగంగానే విడదల రజినీ కారును సైతం అడ్డుకున్నారు టీడీపీ గూండాలు. కారును అడ్డుకుని విడదల రజినీపై దాడికి యత్నించారు. ఆమె కారును కూడా ధ్వంసం చేసేందుకు యత్నించగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. 

ఈ ఘటనపై విడదల రజినీ మాట్లాడుతూ.. ‘ తిరుమల లడ్డు ప్రసాదం విషయంలో టీడీపీ నాయకులు చేసిన విష ప్రచారంతో కూటమి ప్రభుత్వం బాగా డ్యామేజ్ అయ్యింది. లడ్డూ విషయంలో అబద్ధాలు ప్రచారం చేసిన కూటమి నాయకులకు మంచి బుద్ధి ప్రసాదించాలని బోయిపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి పూజలు నిర్వహించాము. కొంతమంది టీడీపీ గుండాలు గుడి బయట హల్‌చల్‌ చేశారు. నేను కారు ఎక్కి కూర్చున్న తర్వాత కారు కదలనివ్వకుండా కారు పై దాడి చేశారు. నా పైన దాడి చేయడానికి ప్రయత్నించారు. మా కార్యకర్తలు,  మా నేతలు వారి దాడిని తిప్పి కొట్టారు. టీడీపీ వాళ్ల ఉడత ఊపులకు భయపడే వాళ్లు ఎవరూ ఇక్కడ లేరు. ఓవరాక్షన్‌ చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి’ అని హెచ్చరించారు.

 

Videos

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

నేను తాడిపత్రి పోతా.. ఏం పీకుతారో పీక్కోండి.. మాస్ వార్నింగ్

మరి గోరం... హీరోయిన్ ఎంగిలి చేసిన బాటిల్ ధర రూ.3 లక్షలు..!

అనంతపురం రూరల్ EX ZPTCపై పోలీసుల ఓవర్ యాక్షన్

Photos

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)

+5

సన్ ఫ్లవర్ తో రితికా నాయక్‌ (ఫొటోలు)