Breaking News

దళిత రైతులపై దౌర్జన్యం

Published on Sun, 12/08/2024 - 05:29

చంద్రగిరి: తరతరాలుగా కుటుంబమంతా కలిసి ఆరుతడి పంటలను పండించుకుంటూ జీవనం గడుపుతున్న దళిత రైతులపై పెత్తందారులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఏళ్ల తరబడి సాగుచేసుకుంటున్న భూమిని కాజేయాలని యత్నించారు. అడ్డుకున్న దళి త రైతులపై బెదిరింపులకు పాల్పడిన ఘ టన శనివారం తిరుపతి జిల్లా, చంద్రగిరి మండల పరిధిలోని నరసింగాపురంలో చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు.. నరసింగాపురం హరిజనవాడకు చెందిన కృష్ణయ్య కుమారులు శ్రీనివాస్, హరికుమార్, గోపాలకృష్ణ  సర్వే నంబరు 321లోని సుమారు 20 సెంట్ల భూమిలో ఉమ్మడిగా సాగుచేసుకుంటున్నారు.

ఈ క్రమంలో తమ భూమికి ఆనుకుని ఉన్న బుచ్చినాయుడుపల్సికి చెందిన చిట్టిబాబునాయుడు, మనోహర్‌నాయుడు అక్రమంగా ప్రవేశించి, జేసీబీ లతో హద్దులు తొలగించారని ఆవేదన వ్య క్తం చేశారు. ఇదేమిటని ప్రశ్నిస్తే కొంతమంది రౌడీలను తీసుకొచ్చి, తమపై దౌర్జన్యం చేయడంతో పాటు బెదిరింపులకు పాల్పడుతున్నారని లబోదిబోమన్నారు. ఎన్నో ఏళ్లుగా భూమిలో సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తుంటే, ఇప్పుడు అధికార పార్టీ నాయకుల పేర్లు చెప్పి దౌర్జన్యానికి పాల్పడుతున్నారని, మహిళలని కూడా చూడకుండా అసభ్యకరంగా మాట్లాడుతున్నారంటూ ఆ వేదన వ్యక్తం చేశారు. 

పెసర, మినుము, జొన్న పంటలను ధ్వంసం చేయడంతో పాటు సుమారు 30 అడుగుల మేర జేసీ బీతో పంటను ధ్వంసం చేసినట్లు తెలి పారు. కాగా, అక్రమంగా జేసీబీతో హద్దులను తొలగిస్తుండడంతో శ్రీనివాస్, హరికుమార్, గోపాలకృష్ణలు జేసీబీకు అడ్డుగా పడుకుని నిరసనకు దిగారు. తాతముత్తాతల కాలం నుంచి ఉన్న భూమిని ఆక్రమించుకుని తమను వేధిస్తున్నారంటూ వారు తమ గోడు చెప్పుకున్నారు. 

ఇప్పటికే దీనిపై రెవెన్యూ, పోలీసులకు ఫిర్యాదు చేశామని, తమకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకోవడమే మార్గమంటూ బోరున విలపించారు. సమాచారం అందుకున్న పోలీ­సులు ఘటన స్థలానికి చేరుకుని ఇరువర్గాల వారిని పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారు.

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)