Breaking News

కదంతొక్కిన ఆశా వర్కర్లు

Published on Tue, 11/19/2024 - 03:42

సాక్షి నెట్‌వర్క్‌: తమ సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్ర­వ్యాప్త పిలుపులో భాగంగా ఏపీ ఆశా వర్కర్స్‌ యూనియ­న్‌ (సీఐటీయూ) ఆధ్వర్యంలో సోమవారం అన్ని జిల్లాల్లో వారు పెద్దఎత్తున ధర్నాలు చేశారు. తమ న్యాయ­మైన డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేస్తూ కదంతొక్కారు. ఎక్కడిక­క్కడ అధికారులకు వినతిపత్రాలి­చ్చారు. పేదలకు ఆరోగ్య సేవలు అందిస్తున్న తమను ప్రభుత్వం కార్మికులుగా గుర్తించా­లని, ఇతర సౌకర్యాలు కల్పించాలని.. ఖాళీ పోస్టుల­ను రాజ­కీయ జోక్యం లేకుండా ప్రభుత్వమే భర్తీచేయాలని విజయ­వాడలో నేతలు డిమాండ్‌ చేశారు. 

రిటైర్‌మెంట్‌ వయస్సు 62 ఏళ్లకు పెంచాలని, రూ.60 వేలు పదవీ విరమణ బెనిఫిట్స్‌ ఇవ్వాలని, బీమా సౌకర్యం కల్పించాలని, చనిపోయిన ఆశాల­కు మట్టి ఖర్చుల కింద రూ.20 వేలు చెల్లించాలని నరసరా­వుపేటలో డిమాండ్‌ చేశారు. తమ సమస్యలపై ప్రభుత్వం గతంలో చేసుకున్న ఒప్పందాలను వెంటనే అమలుచేయాలని ఒంగోలు కలెక్టరేట్‌ వద్ద ఆశా కార్యకర్తలు కోరారు. ఈ ఒప్పందాలకు సంబంధించి జీఓలు ఇవ్వమంటే కూటమి ప్రభుత్వం తమకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించడం సరైనది కాదని ఏలూరు, భీమవరంలో నేతలు అన్నారు. 

గత ఆరునె­ల­ల్లో సీఎంను, ఆరోగ్యశాఖా మంత్రిని, అధికారు­లను అనేక­సార్లు కలిసి తమ సమస్యలు వివరించి వినతిపత్రాలు ఇచ్చామని.. అయినా ఎలాంటి స్పందనాలేకపోవడంతో రోడ్డు మీదకు రావాల్సి వచ్చిందన్నారు. సకాలంలో జీతాలు ఇవ్వకుండా.. జీతాలు పెంచకుండా నిర్లక్ష్యంగా వ్యవహరి­స్తున్నారన్నారు. ఇక ఉదయం నుంచీ ఆందోళన చేసినా డీఎంహెచ్‌ఓ కలెక్టరేట్‌ నుంచి బయటకు రాకపోవడంతో అమలా­పురంలో ఆశా కార్యకర్తలు కలెక్టరేట్‌లోకి దూసుకువెళ్లారు. దీంతో పోలీసులతో తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. 

తమపై విధించిన ఆంక్షలను తొలగించాలని వారు డిమాండ్‌ చేశారు. అలాగే, తమను అసభ్యపదజాలంతో పిలుస్తున్నారని, వేధింపులకు గురిచేస్తున్నారని శ్రీకాకుళంలో ఆశా వర్కర్లు ఆవేదన వ్యక్తంచేశారు. తమకు కనీస వేతనాలు అమలుచేస్తామన్న చంద్రబాబు పట్టించుకోకపోవడం అన్యాయమని విశాఖలో నాయకులు మండిపడ్డారు. 

ఏపీలో సమస్యల పరిష్కరం కోసం కార్మికుల ఆందోళన
  
ఐదు నెలలైనా అమలుచేయకపోవడం బాధాకరం..
ఇక తమ ప్రభుత్వం వస్తే ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తామని టీడీపీ, జనసేన నాయకులు తమ శిబిరాల వద్దకొచ్చి హామీలు ఇచ్చినందున వారికి అధికారం కల్పించారని.. అధికారం పొంది ఐదు నెలలు పూర్తవుతున్నా హామీలు అమలుచేయకపోవడం బాధాకరమని కర్నూలు, నంద్యాల జిల్లాల్లో వారు ఆవేదన వ్యక్తంచేశారు. కర్నూలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయాన్ని ముట్టడించారు. 

అధికారంలోకి వచ్చాక ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేదని వారు విమర్శించారు. తమతో అదనపు పనులు చేయించడం అన్యాయమని చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఆశా వర్కర్లు అభ్యంతరం వ్యక్తంచేశారు. మిషన్‌ ఇంధ్రధనస్సు, హౌస్‌హోల్డ్‌ సర్వే, సంబంధిత ఫార్మెట్లు ఇవ్వకుండా ఆశాలతోనే జిరాక్స్‌ కాపీల ఖర్చు పెట్టిస్తున్నారని అన్నమయ్య జిల్లా రాయచోటిలో నినాదాలు చేశారు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)