Breaking News

బాబు, పవన్‌ను ఓడిద్దాం.. ముస్లింలకు అసదుద్దీన్‌ పిలుపు

Published on Tue, 07/01/2025 - 03:45

కర్నూలు (టౌన్‌): బీజేపీకి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ మద్దతుగా నిలిచి ముస్లింలను దగా చేశారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. సోమవారం రాత్రి కర్నూలు ఎస్టీబీసీ కళాశాల మైదానంలో ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు ఆధ్వర్యంలో ‘వక్ఫ్‌ బచావో.. దస్తూర్‌ బచావో’ నినాదంతో బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా ఒవైసీ మాట్లాడుతూ వక్ఫ్‌ బిల్లుకు మద్దతు ఇచ్చి మోసం చేసిన చంద్రబాబును ముస్లింలు ఎన్నటికీ మరువరన్నారు. టీడీపీలో పనిచేస్తున్న ముస్లింలు, ప్రజాప్రతినిధులు, నాయకులు బయటకు రావాలన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వక్ఫ్‌ బోర్డు సవరణల్ని వ్యతిరేకించారని గుర్తు చేశారు.

వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో ఏ ఎన్నికలు వచి్చనా టీడీపీ, జనసేన పార్టీలను చిత్తుగా ఓడిద్దామని పిలుపునిచ్చారు. అమరావతి అభివృద్ధి పేరుతో చంద్రబాబు రూ.వేల కోట్లను ఆయన  వర్గీయులు, బంధువులకు ధారాదత్తం చేస్తున్నారన్నారు. వక్ఫ్‌ అమలుకు ప్రతి ముస్లిం ప్రాణాలు అర్పించేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఉగ్రవాదుల ఏరివేత ముసుగులో ముస్లింలను బీజేపీ ఇబ్బందులు, వేధింపులకు గురి చేస్తోందన్నారు. పహల్గాంలో అమాయకులను ఊచకోత కోసిన నిందితులను మోదీ ప్రభుత్వం ఎందుకు పట్టుకోలేకపోతోందని ప్రశ్నించారు.

ఆర్‌ఎస్‌ఎస్‌ దేశంలో పేట్రేగిపోతోందని, మసీదులు, దర్గాలను టార్గెట్‌ చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎంఏ గఫర్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి, కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్, ముస్లిం మతపెద్దలు, ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు సభ్యులు పాల్గొన్నారు.

ఎన్నికల ముందు చంద్రబాబు అనేక హామీలు ఇచ్చి మోసం చేశారు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)