Breaking News

బొండా ఉమా గో బ్యాక్‌ 

Published on Mon, 04/08/2024 - 04:34

మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): విజయవాడ అర్బన్‌ జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి పిలవకపోయినా టీడీపీ సెంట్రల్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమా రావడంతో ఉద్రిక్తంగా మారింది. ‘బొండా ఉమా గో బ్యాక్‌’ అంటూ ఆర్యవైశ్యులు నినాదాలు చేశారు. చివరకు కార్యక్రమాన్ని అర్ధంతరంగా నిలిపివేయాల్సి వచ్చింది. విజయవాడలోని మొగల్రాజపురం సున్నపుబట్టీల సెంటర్‌లో గల ఆంధ్రా మోటార్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ హాల్‌లో విజయవాడ అర్బన్‌ జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఆది­వారం జరిగింది.

ఈ కార్యక్రమానికి నిర్వాహకుల ఆహ్వనం మేరకు విజయవాడ సెంట్రల్‌ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాస్‌ హాజరయ్యారు. నూతన కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం అనంతరం వెలంపల్లి శ్రీనివాస్‌ మాట్లాడి వెళ్లారు. ఈ విష­యం తెలుసుకున్న టీడీపీ సెంట్రల్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బొండా ఉమా అక్కడికి వెళ్లారు. వేదికపై వెళ్లి కూర్చోవడంతో ఆర్యవైశ్య కులానికి సంబంధం లేని బొండా ఉమా కార్యక్రమానికి ఎందుకు వచ్చారంటూ విజయవాడ అర్బన్‌ జిల్లా ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షుడు కొండపల్లి బుజ్జి  ప్రశ్నించారు.

పిలవకపోయినా అభినందించడానికి వచ్చారని, పిలవకపోయినా వస్తామంటూ బొండా ఉమా అనుచరుడు, టీడీపీ వాణిజ్య విభాగం అధ్యక్షుడు డూండి రాకేశ్‌ వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో ‘బొండా ఉమా గో బ్యాక్‌’ అంటూ కార్యక్రమానికి హాజరైన వారిలో కొందరు ఆర్యవైశ్యులు నినాదాలు చేశారు. దీంతో బొండా ఉమా వేదిక దిగి వెళ్లిపోయారు. ఈ వివాదం విషయం తెలుసుకున్న మాచవరం పోలీసులు ఆ హాల్‌కు వెళ్లి.. రాజకీయ నాయకులతో సంబంధం లేకుండా కార్యక్రమం నిర్వహిస్తామంటేనే అనుమతులు ఇ­చ్చా­మని నిర్వాహకులతో చెబుతుండగా.. డూండి రాకేశ్‌ వచ్చి ఇది తమ అంతర్గత సమావేశమని, పోలీసులు ఎందుకు వచ్చారంటూ వాదనకు దిగా­రు.

కార్యక్రమం నిర్వహణకు ఇచ్చిన అనుమతిని రద్దు చేస్తున్నామని పోలీసులు నిర్వాహకులతో చెప్పి హాలులో ఉన్న సభ్యులందరినీ బయటకు పంపించేశారు. డూండి రాకేశ్‌ను అరెస్ట్‌ చేసి.. కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. కాగా.. డూండి రాకేశ్‌ అత్యుత్సాహమే వివాదానికి కారణమని విజయవాడ అర్బన్‌ జిల్లా ఆర్యవైశ్య సంఘం సభ్యులు చెప్పారు. బొండా ఉమాకు తాము ఆహ్వా­నం పంపలేదని స్పష్టం చేశారు. ఆర్యవైశ్య ప్రము­ఖులకు మాత్రమే ఆహ్వనాలు పంపామని చెప్పా­రు. బొండా ఉమా కావాలనే తమ కార్యాక్రమానికి వచ్చి వివాదం రాజేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)