Breaking News

వినియోగదారుల కేసుల పరిష్కారంలో కృత్రిమ మేధ

Published on Sat, 09/30/2023 - 04:10

సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: వినియోగదారుల హక్కులకు సంబంధించిన కేసుల పరిష్కారం కోసం కృత్రిమ మేధని వినియోగిస్తుండటం శుభపరిణామమని జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్‌(ఎన్‌సీఆర్‌డీ) అధ్యక్షుడు జస్టిస్‌ అమరేశ్వర్‌ ప్రతాప్‌ సాహి అన్నారు. విశాఖపట్నంలోని ఓ హోటల్లో శుక్రవారం కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆహార, పౌరసరఫరాలు, వినియోగదా­రుల వ్యవహారాల శాఖ, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ‘వినియోగదారుల హక్కులు, రక్షణ’ అనే అంశంపై వర్క్‌షాప్‌ నిర్వహించారు.

దక్షిణాది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శులు, వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ అధ్యక్షులు, వినియోగదారుల గ్రూపులు, ఎన్జీవోలు హాజరయ్యారు. వినియోగదారుల రక్షణ ఫ్రేమ్‌వర్క్, డెవలప్‌మెంట్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫ్‌ స్టాండర్డ్స్, ప్రెస్‌ మానిటరింగ్, లీగల్‌ మెట్రాలజీ యాక్ట్‌–2009 తదితర అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా జస్టిస్‌ సాహి మాట్లాడుతూ వినియోగదారుల కమిషన్‌ గత ఏడాది 1.26 లక్షల కేసులు పరిష్కరించగా, ఈ ఏడాది ఇప్పటివరకు 1.36 లక్షల కేసులు పరిష్కరించడం శుభపరిణామమని చెప్పారు. కేసుల పరిష్కారం కోసం కాన్ఫోనెట్‌ 2.0 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. దీనిపై రాష్ట్రాలు తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని కోరారు. వినియోగదారులు 17 ప్రాంతీయ భాషల్లో ఫిర్యాదులు చేయవచ్చని వివరించారు. ప్రతి నెలా వినియోగదారుల హక్కుల కంట్రోల్‌ రూమ్‌కు లక్షకు పైగా ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. ప్రజలకు తమ హక్కుల పట్ల అవగాహన పెరిగిందని, ఇది స్వాగతించదగిన పరిణామమని పేర్కొన్నారు.

కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి రోహిత్‌కుమార్‌ సింగ్, ప్రత్యేక కార్యదర్శి నిధి ఖరే, ఏపీ ప్రభుత్వ కార్యదర్శి అరుణ్‌కుమార్‌ తదితరులు మాట్లాడు­తూ వినియోగదారుల హక్కులను కాపాడటంతోపాటు ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించేందుకు వినియోగదారు­ల వ్యవహారాల విభాగం ఆయా రాష్ట్రాల సహకారంతో పని చేస్తోందన్నారు. ప్రపంచంలో ఎక్కడైనా తూనికలు, కొలతల పరికరాలను విక్రయించడానికి అంతర్జాతీయంగా ఆమోదించిన ఓఐఎంఎల్‌ సర్టిఫికెట్‌లను జారీ చేసే అథారిటీని పొంది­న 13వ దేశంగా భారత్‌ను జాబితాలో చేర్చడంలో కృషి చేసిన లీగల్‌ మెట్రాలజీ విభాగానికి అభినందనలు తెలిపారు.

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)