Breaking News

ఈ–వ్యర్థాల సేకరణ కేంద్రాలు

Published on Mon, 04/10/2023 - 05:39

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో పేరుకుపోతున్న ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలను (ఈ–­వేస్ట్‌ను) పర్యావరణహితంగా తొలగించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. పాలనలో పార­దర్శకత కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని సేవలను ఆన్‌లైన్‌ విధానంలో అందిస్తుండడంతో ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ–వేస్ట్‌ భారీగా పెరిగిపోతుండటాన్ని సర్కారు గుర్తించింది.

ఏటా ప్రభుత్వ కార్యాలయాల నుంచి వెయ్యి టన్నుల ఈ–వేస్ట్‌ ఉత్పత్తి అవుతున్నట్లు ప్రభుత్వం ప్రాథ­మి­కంగా అంచనా వేసింది. కంప్యూటర్లు, ట్యాబులు, మొబైల్‌ ఫోన్లు, రూటర్లు, స్విచ్‌లు, వైర్లు వంటి వాటి కాలపరిమితి తీరిపోయి పని­చేయనివాటిని సేకరించి రీసైక్లింగ్, డిస్పోజబుల్‌ చేసేవిధంగా ఒక వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది.

ప్రభుత్వ కార్యా­లయాల నుంచి ఈ వేస్ట్‌ సేకరణకు నోడల్‌ ఏజె­న్సీగా ఏపీ టెక్నాలజీస్‌ సర్వీసెస్‌ (ఏపీ­టీఎస్‌)ని నియమించింది. కేంద్ర కాలుష్య నియం­త్రణ మండలి నిబంధనల మేరకు ఈ–­వ్యర్థాలను రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యా­లయాల నుంచి ఈ–వ్యర్థాలను సేకరించి వాటిని తీసుకెళ్లి రీసైక్లింగ్, రీ–ఫర్‌బిషింగ్, డిస్పోజబుల్‌ చేసే బాధ్యతల్ని అప్పగించేందుకు ఏపీటీఎస్‌ టెండర్లు పిలిచింది.

ఆసక్తిగల సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, కార్యాలయాలు, సంస్థల నుంచి ఈ–వేస్ట్‌ సేకరించే విధంగా కార్యాల­యాలను ఏర్పాటు చేయ­నున్నారు. ఎలక్ట్రానిక్‌ వ్యర్థాల్లో 40 శాతం లెడ్‌ ఉంటుంది.

మొత్తం 75 శాతం భార లోహాలను కలిగి ఉండటంతో ఇవి పర్యావరణానికి పెనుముప్పుగా పరిణమించాయి. టెండర్‌ కమ్‌ ఆక్షన్‌ విధానంలో బిడ్డర్‌ను ఎంపిక చేయనున్నామని, అత్యధిక ధర కోట్‌చేసిన సంస్థకు ఈ బాధ్యతను అప్పగిస్తామని ఏపీటీఎస్‌ ఉన్నతాధికారులు వెల్లడించారు.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)