Breaking News

బెట్టింగ్‌కు బానిసై ఆర్మీ ఉద్యోగి అడ్డదారి

Published on Mon, 06/22/2026 - 04:02

పామూరు: ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లకు బానిసైన ఓ ఆర్మీ ఉద్యోగి అప్పులపాలై తప్పుదారి పట్టాడు. డమ్మీ పిస్టల్‌ చూపించి నగదు డిమాండ్‌ చేసి చివరకు పోలీసులకు చిక్కాడు. వివరాల్లోకి వెళ్తే.. అధికారులమని చెప్పి మార్కాపురం జిల్లా పామూరు సమీపంలోని జాతీయ రహదారిపై లారీలు, వాహనాలను ఆపి డమ్మీ పిస్టల్‌ చూపించి యజమానులు, డ్రైవర్లను బెదిరించి, కొట్టి నగదు వసూళ్లకు పాల్పడుతున్న కేసులో డబ్బుగొట్టు మల్లికార్జున, బర్రె చిట్టిబాబు, మచ్చ వంశీ అనే వారిని పోలీసులు ఆదివారం అరెస్ట్‌ చేశారు.

సీఐ దుర్గాసి వినోద్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 12, 16 తేదీల్లో రాత్రివేళ వీరు హైవేపై వెళ్తున్న లారీలను ఆపి అధికారులమని చెప్పి పత్రాల తనిఖీ పేరుతో బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారు. ఈ ఘటనలపై పోలీసులకు ఫిర్యాదు అందగా.. కనిగిరి డీఎస్పీ శ్రీధర్‌ పర్యవేక్షణలో పామూరు ఎస్‌ఐ కట్టా అనూక్, సీఎస్‌పురం ఎస్‌ఐ పిచ్చాల వెంకటేశ్వరరెడ్డి నేతృత్వంలో రెండు బృందాలు ఏర్పాటు చేశారు. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఆదివారం మధ్యాహ్నం విరాట్‌నగర్‌ సెంటర్‌లో నిందితులను అరెస్ట్‌ చేసినట్టు సీఐ తెలిపారు.

నిందితుల్లో ఒకరైన మార్కొండాపురానికి చెందిన డబ్బుగొట్టు మల్లికార్జున అసోంలో ఆర్మీలో పనిచేస్తూ క్రికెట్‌ బెట్టింగుల్లో రూ.20 లక్షల వరకు అప్పులపాలయ్యాడు. అక్రమంగా సొమ్ము సంపాదించి ఆ అప్పులు తీర్చాలన్న ఉద్దేశంతో ఆన్‌లైన్‌లో ఒక ఎయిర్‌ పిస్టల్‌ను కొన్నాడు. ఈ నెల 12న స్వగ్రామంలో తన తాతయ్య కర్మకాండలకు సెలవుపై వచ్చిన మల్లికార్జున బొట్లగూడూరుకు చెందిన స్నేహితుడు బర్రె చిట్టిబా బును కలిసి పరిస్థితి వివరించాడు. మల్లికార్జున తన బంధువైన బలిజపాలెంకు  చెందిన మచ్చ వంశీనీ కలుపుకొని తెలిసిన వ్యక్తి నుంచి కారును అద్దెకు తీసుకుని రాత్రిపూట హైవేపై అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. నిందితుల నుంచి రూ.40 వేల నగదు, ఎయిర్‌ పిస్టల్, కత్తి, నాటుతుపాకీ స్వా«దీనం చేసుకున్నామని సీఐ తెలిపారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)