Breaking News

APSRTC: మహిళలకు ఉచిత ప్రయాణంపై క్లారిటీ

Published on Wed, 01/10/2024 - 21:34

ఎన్టీఆర్‌, సాక్షి: తెలంగాణలో మహాలక్ష్మి పథకం కింద.. మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సులో ఉచిత ప్రయాణ సదుపాయం తీసుకొచ్చింది కాంగ్రెస్‌ ప్రభుత్వం. ఆర్టీసీకి నష్టం రాకుండా ఆ భారమంతా తెలంగాణ ప్రభుత్వమే భరించనుంది. అయితే.. ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణమంటూ ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో APSRTC స్పందించింది. 

ఏపీలో మహిళలకు ఉచిత ప్రయాణంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఏపీఎస్‌ ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌  ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఇక.. సంక్రాంతికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలిపిన ఆయన.. రాను పును బుక్‌ చేసుకుంటే పది శాతం రాయితీ వర్తిస్తుందని తెలిపారు. ఇక మరో నాలుగు నెలల్లో 1,500 కొత్త బస్సులు రాబోతున్నాయని, త్వరలో సరికొత్త హంగులతో సూపర్‌ లగ్జరీ బస్సులు వస్తాయని ఆయన అన్నారు. 

ఇక సంక్రాంతి సందర్భంగా గురువారం నుంచి డోర్ పిక్ అప్ అండ్ డోర్ డెలివరీ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు ఏపీఎస్‌ ఆర్టీసీ ఎండీ. గతంలో డోర్ డెలివరీ ప్రైవేట్ సంస్థతో ఒప్పందం చేసుకుని నిర్వహించేదని.. ఇప్పుడు ఆర్టీసీనే స్వయంగా చేయనుందని చెప్పారాయన. రోజుకు డోర్ డెలివరీ సర్వీస్ లు 25వేలకు పైగా జరుగుతున్నాయని.. ప్రస్తుతానికి విజయవాడలో మాత్రమే పికప్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే ముఖ్యనగరాలకు ఆ సేవల్ని విస్తరిస్తామని తెలిపారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)