Breaking News

ఏపీఆర్‌ఎస్‌–2025 ఫలితాలు విడుదల

Published on Thu, 05/15/2025 - 03:52

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ గురుకుల విద్యాలయాల సంస్థ (ఏపీఆర్‌ఎస్‌) ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలలు, జూనియర్‌ , డిగ్రీ కళాశాలల్లో 2025–26 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీఆర్‌ఎస్‌ సెట్, ఏపీఆర్‌జేసీ, ఏపీఆర్‌డీసీ సెట్‌ ఫలితాలు బుధవారం ప్రకటించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ఎక్స్‌లో విడుదల చేశారు. అన్ని విభాగాల్లో 7,190 సీట్లకు 62,047 మంది విద్యార్థులు పోటీ పడ్డారు. 

ఐదో తరగతిలో 3920 సీట్లకు 14061 మంది పోటీ పడగా, 6, 7, 8 తరగతుల్లో మిగిలిన సీట్లకు ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. అలాగే, ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరంలో 1425 సీట్లకు 41,215 మంది, డిగ్రీ మొదటి సంవత్సరంలో 220 సీట్లకు 1,018 మంది  పోటీపడ్డారు. పరీక్ష రాసిన అందరికీ ర్యాంకులు ప్రకటించారు.

ఫలితాలను  విద్యార్థి ఐడీ ద్వారా  https:// aprs.apcfss.in  వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చని ఏపీఆర్‌ఈఐ సొసైటీ కార్యదర్శి వీఎన్‌ మస్తానయ్య తెలిపారు. పాఠశాలలకు ఎంపికైన విద్యార్థుల జాబితాతో పాటు జూనియర్‌ కళాశాలలు, డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. 

టాపర్లు వీరే..
ప్రవేశ పరీక్షల్లో మొదటి స్థానంలో నిలిచిన విద్యార్థుల వివరాలను వెల్లడించారు. ఐదో తరగతిలో వజ్రపు శశికుమార్‌ (శృంగవరపుకోట, విజయనగరం జిల్లా), ఆరో తరగతి గొల్లంగి మౌనిక (రాళ్లపాడు, శ్రీకాకుళం జిల్లా), ఏడో తరగతిలో కర్రా తనీశి శ్రీవర్షిణి (భోగాపురం, అనకాపల్లి జిల్లా), ఎనిమిదో తరగతి వల్లూరి రిచా (చిన్నయగూడెం, తూర్పు గోదావరి జిల్లా) అత్యధిక మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచారు.

ఇంటర్మీడియట్‌లో..
» ఎంపీసీ– బాలినేని కళ్యాణ్‌ రామ్‌ (సింగివలస, విశాఖ జిల్లా) 
» బైపీసీ– బొడ్డుపల్లి మనోజ్‌ కుమార్‌ (కంతేరు, రాజమండ్రి రూరల్‌) 
» ఎంఈసీ/సీఈసీ– మాదివాడ వేదాశ్రిత (వేలివెన్ను, తూర్పు గోదావరి జిల్లా)
»ఈఈటీ– దగరి సాయి చరణ్‌ (వేలివెన్ను, తూర్పు గోదావరి జిల్లా)
» సీజీటీ– సరికి చరణ్‌ (వేలివెన్ను, తూర్పు గోదావరి జిల్లా) 

డిగ్రీలో..
» బీఏ– కోటకొండ విజయుడు (మునగాల, కర్నూలు జిల్లా)
»బీకామ్‌– చిన్నబసప్పగారి బసవరాజు (భైరవాని తిప్ప, అనంతపురం జిల్లా)
»బీఎస్సీ (కెమిస్ట్రీ)– అడపా విజయ్‌ (నరసన్నపేట, శ్రీకాకుళం జిల్లా)
» బీఎస్సీ (డేటా సైన్స్‌ అండ్‌ కంప్యూటర్‌ సైన్స్‌)– కల్వటాల కిరీటి (ఆళ్లగడ్డ, నంద్యాల జిల్లా)
» బీ.ఎస్సీ (జువాలజీ)–  వంతల శ్రీకాంత్‌ (గాడేపల్లి, అల్లూరి సీతారామరాజు)

Videos

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

నేను తాడిపత్రి పోతా.. ఏం పీకుతారో పీక్కోండి.. మాస్ వార్నింగ్

మరి గోరం... హీరోయిన్ ఎంగిలి చేసిన బాటిల్ ధర రూ.3 లక్షలు..!

అనంతపురం రూరల్ EX ZPTCపై పోలీసుల ఓవర్ యాక్షన్

జోగి రమేష్ హౌస్ అరెస్ట్

ఆ 15 స్థానాల్లో పోటీయే లేదు..! లైవ్ లో మొత్తం బయటపెట్టిన YS జగన్

Photos

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)

+5

సన్ ఫ్లవర్ తో రితికా నాయక్‌ (ఫొటోలు)