Breaking News

రూ.5,000 కోట్ల హడ్కో రుణానికి ఆమోదం

Published on Sat, 10/11/2025 - 05:46

సాక్షి, అమరావతి: ఏపీఐఐసీ అనుబంధ సంస్థ రాష్ట్ర ప్రాజెక్టుల అభివృద్ధి కార్పొరేషన్‌ ద్వారా హడ్కో నుంచి 8.6 శాతం వడ్డీతో తీసుకున్న రూ.5,000 కోట్ల రుణానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నిధులతో కర్నూలు జిల్లా ఓర్వకల్లు, వైఎస్సార్‌ కడప జిల్లా కొప్పర్తి, ప్రకాశం జిల్లా పామూరులో పారిశ్రామిక క్లస్టర్లను అభివృద్ధి చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. 

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి కె.పార్థసారథి మీడియాకు వెల్లడించారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన ‘డీఏ’ గురించి విలేకరులు ప్రస్తావించగా.. అసలు ఆ అంశంపై కేబినెట్‌ సమావేశంలో చర్చే జరగలేదని, దీనిపై తనకు అవగాహన లేదని మంత్రి బదులిచ్చారు. మంత్రివర్గ సమావేశం నిర్ణయాలిలా... 

» రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి నగరాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘లిఫ్ట్‌ పాలసీ’ సవరణకు ఆమోదం. ఎకరం రూ.4 కోట్ల చొప్పున అర ఎకరం నుంచి నాలుగు ఎకరాల వరకు కేటాయించేలా సవరణలు. భూములు కేటాయించిన నాటి నుంచి 12 నెలల్లో వర్కింగ్‌ స్టేషన్ల నిర్మాణం పూర్తి చేసి మరో 12 నెలల్లో 500 మందికి ఉద్యోగాలు కల్పించాలి. 

» ఆంధ్రప్రదేశ్‌ డిస్ట్రిక్ట్   ఫార్మేషన్‌ రూల్స్‌ 1984 నిబంధన (5)కు అనుగుణంగా ఏఎస్‌ఆర్‌ జిల్లా వై.రామవరం మండలం రంపచోడవరం డివిజన్‌ను గుర్తేడు, వై.రామవరం మండలాలుగా విభజిస్తూ నోటిఫికేషన్‌ జారీకి రెవెన్యూ శాఖ ప్రతిపాదనకు ఆమోదం. 59 గ్రామాలతో గుర్తేడు, 78 గ్రామాలతో వై.రామవరం మండల కేంద్రాలుగా ఏర్పాటు కానున్నాయి.  

»  అమరావతిలో గవర్నర్‌ నివాసం, దర్బార్‌ హాల్‌ నిర్మాణాన్ని రూ.212.22 కోట్లతో చేపట్టేందుకు పరిపాలన అనుమతికి ఆమోదం. సీఆర్‌డీఏ అథారిటీ ఇప్పటికే కన్వెన్షన్‌ కేంద్రాల కోసం 2.5 ఎకరాలు కేటాయించగా అదనంగా మరో నాలుగు ఎకరాలు కేటాయించి నిర్మాణాలను చేపట్టేందుకు అనుమతి.  

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)