Breaking News

వలంటీర్‌ వ్యవస్థ బాగుంది 

Published on Tue, 08/15/2023 - 04:59

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలకు ఇంటి వద్దే ప్రభుత్వ పథకాలు, సేవ­లను అందించే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన వలంటీర్ల వ్యవస్థ చాలా బాగుందని మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ప్రశంసించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి 50 కుటుంబాలకు ఒక వలంటీరును నియమించడం, 2.62 లక్షల మందికి గ్రామస్థాయి­లో సేవ చేసే అవకాశం కల్పించడం అభినందనీయమన్నారు. దీనిపై తక్షణం అధ్యయనం నిర్వహించి నివేదిక సమరి్పంచాలని తన కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు.

సీఎం శివరాజ్‌సింగ్‌ ఆదేశాల మేరకు ఆయన ఓఎస్డీ లోకేష్‌ నవరత్నాలు, వలంటీర్లు, సచివాలయాల వ్యవస్థ గురించి ‘సాక్షి’ ప్రతినిధి నుంచి వివరాలను సేకరించారు. మరి కొద్ది నెలల్లో మధ్యప్రదేశ్‌ శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో శనివారం రాత్రి భోపాల్‌లోని తన అధికారిక నివాసంలో మీడియాతో సీఎం శివరాజ్‌సింగ్‌ ముచ్చటించారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఏపీలో అమలవుతున్న పలు పథకాల గురించి ఆరా తీశారు. ఆ వివరాలివీ.. 

► ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సచివాలయాల వ్యవస్థను తీసుకొచ్చి గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు 500కిపైగా సేవలందించడం, ప్రతి 50 కుటుంబాలకు ఒక వలంటీరు చొప్పున నియమించడం వినూత్నం, అభినందనీయం. యువతకు స్థానికంగా తోటివారికి సేవలందించే అవకాశం లభిస్తుంది.  
► ఎలాంటి పడిగాపులు లేకుండా ఇంటివద్దే రేషన్‌ సరుకులు అందించడం కూడా బాగుంది.  
► ప్రజాస్వామ్యంలో అందరినీ స్వాగతిస్తాం. బీఆర్‌ఎస్‌ పార్టీ మరింత జోరుగా మా రాష్ట్రానికి రావచ్చు. అయినా తెలంగాణలో జరుగుతున్న అవినీతి గురించి దేశం మొత్తానికి తెలుసు.    

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)