Breaking News

టీడీపీ సిండికేట్‌ లక్కీ‘డ్రాప్‌’!

Published on Sat, 08/30/2025 - 03:08

సాక్షి, అమరావతి: బార్ల ముసుగులో దోపిడీకి టీడీపీ సిండికేట్‌ పన్నాగం పన్నుతోంది. ఉద్దేశపూర్వకంగానే దరఖాస్తులు దాఖలు చేయకుండా కుట్రపన్నుతోంది. దశలవారీగా బార్లను లాటరీ విధానంలో దక్కించుకోవడంతోపాటు ఆ గడువులోగా దరఖాస్తులు రాలేదనే సాకుతో అదనపు 15శాతం లాభాల మార్జిన్‌ పెంచి కొల్లగొట్టేలా కథ నడిపిస్తోంది. ఆ ఎత్తుగడలో భాగంగానే రాష్ట్రంలో నోటిఫికేషన్‌ జారీ చేసిన అన్ని బార్లకు పూర్తిగా దరఖాస్తులు దాఖలు చేయకుండా ఉద్దేశపూర్వక తాత్సా­ర వైఖరి ప్రదర్శించింది. వేరే వాళ్లను దరఖాస్తులు దాఖలు చేయనివ్వడం లేదు. 

రాష్ట్రంలో 840 బార్లకు లైసెన్సుల కేటాయింపునకు నోటిఫికేషన్‌ జారీ చేయగా... దరఖాస్తుల దాఖలుకు మొదట ఈ నెల 27ను గడువుగా నిర్ణయించారు. ఆ తరువాత ఆ గడువును శుక్రవారం వరకు పొడిగించారు. శుక్రవారంతో గడువు ముగిసేసరికి దాదాపు 300 బార్లకు మాత్రమే కనీసం నాలుగు చొప్పున దరఖాస్తులు దాఖలయ్యాయి.

నిబంధనల ప్రకారం కనీసం నాలుగు దరఖాస్తులు వచ్చే బార్లకే లాటరీ విధానంలో లైసెన్సులు కేటాయిస్తారు. మిగిలిన 540 బార్లకు మరికొన్ని దశల్లో నోటిఫికేషన్‌ జారీ చేసి... వాటిని కూడా ఏకపక్షంగా టీడీపీ సిండికేట్‌కు కేటాయించేలా పన్నాగాన్ని అమలు చేస్తున్నారు. శుక్రవారంనాటికి దాఖలైన 300 బార్లకు శనివారం లాటరీ విధానంలో ఎక్సై­జ్‌ శాఖ లైసెన్సులు కేటాయించనుంది.   

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)