Breaking News

నీటి పంపిణీ బాధ్యత కృష్ణా బోర్డుదే

Published on Fri, 12/27/2024 - 05:31

సాక్షి, అమరావతి: కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్‌ (కేడబ్ల్యూడీటీ)–2 అవార్డు అమల్లోకి వచ్చేవరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కృష్ణా నదీ జలాలు పంపిణీ చేసే బాధ్యత కృష్ణా బోర్డుదేనని కేంద్ర జల్‌ శక్తి శాఖ స్పష్టం చేసింది. నీటి పంపకాల్లో అపెక్స్‌ కౌన్సిల్‌ జోక్యం చేసుకోబోదని బోర్డుకు తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత నీటి సంవత్సరంలో రెండు రాష్ట్రాలకు నీటి పంపిణీపై జనవరి 21న నిర్వహించే 19వ సర్వసభ్య సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని కృష్ణా బోర్డు నిర్ణయించింది. 

కృష్ణా నదిలో 75 శాతం లభ్యత ఆధారంగా 811 టీఎంసీలను ఉమ్మడి ఏపీకి కేడబ్ల్యూడీటీ–1 కేటాయించింది. విభజన నేపథ్యంలో కృష్ణా నదీ జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు తలెత్తకుండా చూసేందుకు 2014 మే 28న కేంద్రం కృష్ణా బోర్డును ఏర్పాటుచేసింది. 

కేడబ్ల్యూడీటీ–1 ప్రాజెక్టుల వారీగా చేసిన నీటి కేటాయింపుల ఆధారంగా 2015–16 నీటి సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌కు 512.06, తెలంగాణకు 298.94 టీఎంసీలను పంపిణీ చేస్తూ 2015 జూలై 18–19న కేంద్ర జల్‌ శక్తి తాత్కాలిక సర్దుబాటు ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో 2016 సెప్టెంబర్‌ 21న అపెక్స్‌ కౌన్సిల్‌ తొలి సమావేశంలో 2016–17 సంవత్సరంలోనూ తాత్కాలిక సర్దుబాటు ప్రకారమే నీటిని పంపిణీ చేసుకోవడానికి రెండు రాష్ట్రాలు అంగీకరించాయి.

అపెక్స్‌ కౌన్సిల్‌ అజెండాలో చేర్చాలని..
రెండు రాష్ట్రాలకు కృష్ణా జలాల పంపకాల అంశాన్ని అపెక్స్‌ కౌన్సిల్‌లో చర్చించి.. తుది నిర్ణయం తీసుకునేలా అజెండాలో చేర్చాలని కేంద్ర జల్‌ శక్తి శాఖకు కృష్ణా బోర్డు విజ్ఞప్తి చేసింది. కృష్ణా బోర్డు పనితీరుపై 2024 జనవరి 9న కేంద్ర జల్‌ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో కృష్ణా జలాల పంపకం అంశాన్ని కృష్ణా బోర్డు అధికారులు లేవనెత్తారు. 

కృష్ణా జలాల పంపకం జోలికి అపెక్స్‌ కౌన్సిల్‌ వెళ్లబోదని కేంద్ర జల్‌ శక్తి శాఖ కార్యదర్శి తేల్చిచెప్పారు. కేడబ్ల్యూడీటీ–2 అవార్డు అమల్లోకి వచ్చే వరకూ ఇప్పటిలానే రెండు రాష్ట్రాలతో ఏటా సంప్రదింపులు జరిపి.. నీటిని పంపిణీ చేసే బాధ్యత కృష్ణా బోర్డుదేనని అధికారులకు దిశానిర్దేశం చేశారు. 

66:34 నిష్ఫత్తిలో పంపిణీ
ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో లభ్యత గల జలాల్లో ఏపీ 66 శాతం, తెలంగాణ 34 శాతం వాడుకునేలా 2017–18 నీటి సంవత్సరంలో రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. 2018–19, 2019–20, 2020–21, 2021–22, 2022–23 సంవత్సరాల్లో బోర్డు సర్వసభ్య సమావేశాల్లో రెండు రాష్ట్రాలతో చర్చించి అదే పద్ధతి ప్రకారం కృష్ణా బోర్డు నీటిని పంపిణీ చేసింది. 

కానీ.. 2023–24 నీటి సంవత్సరానికి సంబంధించి నీటి పంపకాలపై 2023 మే 10న నిర్వహించిన కృష్ణా బోర్డు సమావేశంలో తమకు 50 శాతం వాటా కావాలని తెలంగాణ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డిమాండ్‌ చేశారు. దీన్ని ఏపీ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి తోసిపుచ్చారు. 

దాంతో కృష్ణా జలాల లభ్యత, అవసరాలపై ఎప్పటికప్పుడు చర్చించి, కేటాయింపులు చేసే బాధ్యతను త్రిసభ్య కమిటీకి కృష్ణా బోర్డు అప్పగించింది. దీనిపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేయడంతో.. పాత పద్ధతి ప్రకారమే ఉమ్మడి ప్రాజెక్టుల్లో 66 శాతం ఏపీ, తెలంగాణకు 34 శాతం పంపిణీ చేస్తూ కృష్ణా బోర్డు తుది నిర్ణయం తీసుకుంది.  

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)