Breaking News

ఫార్మసీ ప్రవేశాలకు వేళాయే

Published on Sat, 11/30/2024 - 05:51

గుంటూరు ఎడ్యుకేషన్‌: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఏపీ ఈఏపీసెట్‌–2024)కు సంబంధించిన ఫార్మసీ, బయోటెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. ఎంపీసీ స్ట్రీమ్‌లో బీ.ఫార్మసీ, ఫార్మా–డీ కోర్సులతోపాటు బైపీసీ స్ట్రీమ్‌లో బీఈ, బీ.టెక్‌లలో బయో టెక్నాలజీ, ఫుడ్‌ టెక్నాలజీ, ఫార్మాసూ్యటికల్‌ ఇంజనీరింగ్, బీ.ఫార్మసీ, ఫార్మా–డీ కోర్సుల సీట్ల భర్తీ కోసం వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహణకు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ, ఉన్నత విద్యామండలి షెడ్యూల్‌ విడుదల చేశాయి. 

ఏపీ ఈఏపీసెట్‌–2024లో అర్హత సాధించిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకుని, ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించాల్సి ఉంది. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.1,200, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.600 చొప్పున ట్ఛ్టట.టఛిజ్ఛి.­్చp.­జౌఠి.జీn లో లాగిన్‌ అయ్యి క్రెడిట్‌ కార్డు, డెబిట్‌కార్డు, నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా చెల్లించాలి. ఎంపీసీ స్ట్రీమ్‌ విద్యార్థులు ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించేందుకు శనివారం రాత్రి వరకు అవకాశం ఉంది. 

డిసెంబర్‌ ఒకటో తేదీ వరకు విద్యార్థులు అప్‌లోడ్‌ చేసిన సర్టిఫికెట్లను ఎంపిక చేసిన హెల్ప్‌లైన్‌ కేంద్రంలో పరిశీలిస్తారు. శని, ఆదివారాల్లో కళాశాలలను ఎంపిక చేసుకునేందుకు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. వెబ్‌ ఆప్షన్లు మార్చుకునేందుకు డిసెంబర్‌ 2వ తేదీ ఒక్క రోజు అవకాశం ఉండగా, 4వ తేదీన సీట్లు కేటాయిస్తారు. డిసెంబర్‌ 4 నుంచి ఆరో తేదీలోపు కళాశాలల్లో చేరాల్సి ఉంది. బైపీసీ స్ట్రీమ్‌ విద్యార్థులు శనివారం నుంచి డిసెంబర్‌ 5వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించాలి. 

డిసెంబర్‌ 2 నుంచి 6వ తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది. కళాశాలల ఎంపిక కోసం 3 నుంచి 7వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. 8వ తేదీన వెబ్‌ ఆప్షన్లు మార్చుకోవచ్చు. డిసెంబర్‌ 11 సీట్లను కేటాయిస్తారు. అదే రోజు నుంచి 14వ తేదీలోపు కళాశాలల్లో చేరాలి.

Videos

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)