Breaking News

పల్లె కన్నీరు పెడుతోందో..

Published on Tue, 01/14/2025 - 05:32

సాక్షి, రాజమహేంద్రవరం/చాగల్లు: సంక్రాంతి వస్తోందంటే గోదావరి వాసుల అతిథి మర్యాదలే గుర్తుకొస్తాయి. గోదారోళ్లా మజాకా అనిపిస్తారు. అందుకే ఎక్కడున్నా ఈ పెద్ద పండగకు వారం నుంచి మూడు రోజుల ముందే స్వగ్రామాలకు వచ్చేస్తారు. ఆటపాటలు, కోడి పందేలు, బావామరదళ్ల అల్లర్లతో అసలు తగ్గేదేలే అన్నట్టుగా సంబరంగా ఈ పండగ నిర్వహించుకుంటారు. నచ్చిన వంటకాలు చేసుకుంటారు. కుటుంబమంతా ఒక్కచోటకు చేరి సంతోషంగా గడుపుతారు. కొత్త అల్లుళ్లకు పదుల సంఖ్య వంటలు వండి విందుభోజనం పెడతారు. గోదావరి జిల్లాల్లో ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్న సంక్రాంతి సందడి ఈ ఏడాది ఆశించిన మేర కనిపించడం లేదు.

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో వివిధ సంక్షేమ పథకాల అమలుతో ప్రజల వద్ద పుష్కలంగా డబ్బులుండేవి. వేడినీళ్లకు చన్నీళ్లు తోడన్నట్టుగా.. జనం కష్టపడి సంపాదించుకున్నదానికి ప్రభుత్వం అందించే సొమ్ము తోడయ్యేది. ఫలితంగా గత ఏడాది సంక్రాంతి పండగను ప్రజలు ఎంతో సంబరంగా నిర్వహించుకున్నారు. కానీ, ఈ ఏడాది ఆ సందడి కానరావడం లేదు. కూటమి ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలు నిలిచిపోవడం.. వరుస విపత్తులతో ఖరీఫ్‌ పంటలు దెబ్బ తినడం.. ఆర్థిక సమస్యలు.. పెరిగిన ధరలు వంటి కారణాలతో ప్రజల వద్ద డబ్బు లేకుండా పోయింది. దీంతో ఈ ఏడాది దాదాపు ఏ వ్యాపారమూ ఆశించిన మేర జరగడం లేదు. గ్రామీణ ప్రజల్లో పండగ జోష్‌ కూడా కనిపించడం లేదు.  

ఊనగట్ల.. పండగ కనబడటంలే.. 
మూడు గ్రామాలకు వ్యాపార కేంద్రంగా ఉన్న ఊనగట్ల జనాభా 7,500. గ్రామంలో 5,300 మంది ఓటర్లున్నారు. ఉదయం 9 గంటల సమయంలో ‘సాక్షి’ బృందం ఆ గ్రామంలోకి అడుగు పెట్టింది. మధ్యాహ్నం ఒంటి గంట వరకూ విస్తృతంగా పర్యటించింది. కనబడిన ప్రతి ఒక్కరినీ పలకరించింది. గత ఏడాది ఈపాటికే గ్రామంలో కొద్ది రోజుల ముందే సంక్రాంతి సందడి కనిపించేది. కానీ ఈసారి భోగి పండగ ముందు రోజు కూడా వీధుల్లో సంక్రాంతి ముగ్గులు, ఇళ్లల్లో బంధువుల సందడి కనిపించలేదు. గొబ్బెమ్మల కోలాహలమే లేదు. దుకాణాలు ఖాళీగా దర్శనమిచ్చాయి. నిత్యావసరాల ధరలు పెరగడంతో పిండివంటలు వెతికినా దొరకని పరిస్థితి. అదేమని గ్రామస్తులను ఆరా తీస్తే అసలు విషయం వెల్లడైంది. ‘గత ఏడాదే నయం. చేతి నిండా డబ్బుండేది. పండగ ధూం ధాంగా చేసుకునే వాళ్లం’ అంటూ నిట్టూర్చారు.

వైఎస్సార్‌ సీపీ హయాంలో రూ.51.07 కోట్ల మేర సంక్షేమం 
గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున అమలు చేసింది. ఈ క్రమంలో ఊనగట్ల గ్రామానికి 33 పథకాల ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీ , పరోక్ష చెల్లింపుల విధానంలో ఏకంగా రూ.51.07 కోట్ల మేర లబ్ధి చేకూరింది. డీబీటీ ద్వారా రూ.­33,70,37,857, నాన్‌ డీబీటీ ద్వారా మరో రూ.­14,28,32,390 కోట్ల మేర లబ్ధి కలిగింది. ఇవి కాకుండా నాడు – నేడు ద్వారా పాఠశాలల అభివృద్ధి చేపట్టారు. ఇంటి స్థలాలు ఇచ్చి ఇళ్లు నిర్మించారు. ప్రభుత్వ సేవలను ప్రజల చెంతకే చేర్చారు. అమ్మ ఒడి, పింఛన్లు, చేయూత, జగనన్న విద్యా, వసతి దీవెన వంటి అనేక పథకాలతో ఆర్థిక ఆసరా కల్పించారు. పండగ సమయానికి ఏదో ఒక పథకం కింద మహిళల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేసేవారు. దీంతో అప్పట్లో సంక్రాంతి పండగను సంతోషంగా నిర్వహించుకునే వారమని పలువురు ‘సాక్షి’కి చెప్పారు.  

వైఎస్సార్‌ సీపీ హయాంలో గ్రామాభివృద్ధి 
గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో గ్రామాభివృద్ధికి కృషి చేశాం. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాం. డీబీటీ, నాన్‌ డీబీటీ ద్వారా గ్రామానికి రూ.51.07 కోట్ల లబ్ధి చేకూర్చాం. రూ.1.30 కోట్లతో పాఠశాలలు అభివృద్ధి చేశాం. రూ.80 లక్షలతో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్‌ సెంటర్‌ భవన నిర్మాణాలు చేపట్టాం. రూ.2.20 కో­ట్లు వెచ్చించి పేదలకు ఇంటి స్థలాలు కేటాయించాం. 204 ఇళ్ల నిర్మాణాలకు నాంది పలికాం. రూ.1.03 కోట్లతో ఊనగట్ల – అమ్ముగుంట రోడ్డు పనులు నిర్వహించాం. రూ.50 లక్షలతో ఊనగట్ల – కలవలపల్లి రోడ్డు నిర్మాణం చేపట్టాం. ప్రస్తుతం పథకాలేవీ అందకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. – మట్టా వెంకట్రావు, ఊనగట్ల,సర్పంచ్‌ 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)