Breaking News

జల విపత్తు మృతుల్లో రాష్ట్రమే టాప్‌!

Published on Fri, 08/15/2025 - 05:53

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌  దేశవ్యాప్తంగా జల వాతావరణ విపత్తుల్లో అత్యధిక మృతులు నమోదైన రాష్ట్రంగా మారింది. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి జూలై వరకూ కేవలం నాలుగు నెలల్లో రాష్ట్రంలో 343 మంది జల విపత్తుల్లో ప్రాణాలు కోల్పోయారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాలు తేల్చిన ఈ నిజం– రాష్ట్ర విపత్తు నిర్వహణలో కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని బట్టబయలు చేస్తున్నాయి.  కొన్ని ముఖ్యాంశాలు..

⇒  ఏప్రిల్‌ నుంచి జూలై మధ్య కాలంలో దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి అందిన సమాచారం ప్రకారం జల వాతావరణ విపత్తుల కారణంగా  1,626 మంది మృతి చెందారు. 
⇒  జలాశయాల దగ్గర ఎటువంటి ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయకపోవడంతో చాలా మంది జలాశయాల్లో దిగి మృతి చెందుతున్నారు. 
⇒ భారీ వర్షాలకు లోతట్టు ప్రాంత ప్రజలను ముందుగానే  అప్రమత్తం చేయకపోవడంతో చాలా మంది ప్రాణాలను కోల్పోవాల్సిన పరిస్థితులు నెలకుంటున్నాయి.

⇒ మృతుల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్‌ తర్వాతి స్థానాల్లో మధ్యప్రదేశ్‌ (243), హిమాచల్‌ ప్రదేశ్‌ (195) నిలిచాయి.  
⇒ జల  విపత్తులు సంభవించిన రాష్ట్రాల్లో నష్టాలను అంచనా వేసిన తరువాత జాతీయ విపత్తుల నిధి నుంచి కేంద్రం ఆర్థిక సాయం అందిస్తుందని గణాంకాల నివేదిక పేర్కొంది. 
⇒ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జూలై 15వ తేదీ నాటికి జాతీయ విపత్తుల నిధి నుంచి కేంద్ర వాటాగా 22 రాష్ట్రాలకు రూ.9,578.40 కోట్లను విడుదల చేసినట్లు కేంద్ర హోమంత్రిత్వ శాఖ వెల్లడించింది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)