తీవ్ర సంక్షోభంలో రాష్ట్ర వ్యవసాయ రంగం

Published on Sat, 11/29/2025 - 05:26

సాక్షి, అమరావతి: తుపానుల ప్రభావం, గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, రాష్ట్రంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని వైఎస్సార్‌సీపీ జనరల్‌ సెక్రటరీ (అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మర్స్‌ వెల్ఫేర్‌), వ్యవసాయ మిషన్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం అది పక్కనపెట్టి రైతు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన ప్రతిపక్ష నాయకుడిపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తోందని ఆయన మండిపడ్డారు.

దేశ సగటుకన్నా రాష్ట్ర సగటు సాగు విస్తీర్ణం పడిపోయినా ఈ ప్రభుత్వం మేల్కోవడం లేదని, మోంథా తుపాను, మద్దతు ధరలు లేకపోవడం వల్ల రాష్ట్రంలో మూడు ప్రధాన పంటలు వరి, పత్తి, మొక్కజొన్న సాగుచేస్తున్న రైతులు ఈ ఏడాది రూ.13,324 కోట్లు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పత్తిరైతులు రూ. 9,209 కోట్లు, మొక్కజొన్న రైతులు రూ.1,536 కోట్లు  నష్టపోయారని పేర్కొన్నారు.. టమాట, చీనీ, అరటి పంటలకు కనీస మద్దతు ధరలు కరువై పంటలను రాయలసీమలో రోడ్లపై పారబోస్తున్న పరిస్థితులు నెలకొన్నాయని వివరించారు. సాధారణ పంటలతో పోలిస్తే హార్టికల్చర్‌ సాగు విస్తీర్ణం తక్కువే అయినా జీఎస్‌డీపీలో మాత్రం మెజారిటీ వాటా పండ్ల తోటలదే అన్న విషయాన్ని ఈ ప్రభుత్వం విస్మరిస్తోందని విమర్శించారు.  ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని రైతులకు మేలు చేసే కార్యక్రమాలపై దృష్టిపెట్టాలని హితవు పలికారు. 

11 లక్షల ఎకరాల్లో వరి పంట నష్టం 
‘మోంథా తుపాను వల్ల అన్ని పంటలు కలిపి 4 లక్షల ఎకరాల్లోనే దెబ్బతిన్నట్టు ప్రభుత్వం చెబుతోంది. వాస్తవానికి మోంథా తుపాను ముందు వరకు రాష్ట్రంలో వరి సాగు బాగానే ఉన్నా తర్వాత బాపట్ల నుంచి శ్రీకాకుళం వరకు 28 లక్షల ఎకరాలపై తుపాను ప్రభావం తీవ్రంగా పడింది. అందులో 11 లక్షల ఎకరాల్లో దిగుబడులు పడిపోతున్నాయని గతంలోనే మా పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ చెప్పారు. ఒక్క వరిలోనే 11 లక్షల ఎకరాల్లో పంటదెబ్బతింటే అన్నిపంటలూ కలిపి 4 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్నాయని ప్రభుత్వం చెబుతోంది. 83 లక్షల టన్నుల ఉత్పత్తి కూడా 73 నుంచి 74 లక్షల టన్నులకు పడిపోబోతోంది. 33 శాతం పైన పంట దెబ్బతింటేనే ఇన్‌పుట్‌ సబ్సిడీకి అర్హత ఉందంటున్నారు.

అంతకన్నా తక్కువ నష్టం జరిగిన రైతుల గురించి చెప్పడం లేదు. 83 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే పరిస్థితి ఉందని ప్రభుత్వం అంచనా వేస్తున్నట్టు, అందులో 51 లక్షల టన్నులు సేకరిస్తామని చెబుతున్నారు. గత రబీ సీజన్‌లో అమ్మిన పంటకు ఏప్రిల్‌ తరువాత నాలుగు నెలలపాటు డబ్బులు ఇవ్వకున్నా 24 గంటల్లోనే డబ్బులిస్తున్నట్టు పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ చెప్పడం హాస్యాస్పదం. ఈ దిగుబడి మోంథా తుపాన్‌ కారణం గా ఉత్పత్తి తగ్గడం వల్ల సేకరణ కూడా 36 టన్నుల నుంచి 37 లక్షల టన్నులు దాటదు’ అని చెప్పారు.

వరి రైతుకు రూ.2579 కోట్లు నష్టం 
‘కల్లాల్లో ధాన్యం.. కళ్లల్లో దైన్యం! శీర్షికతో తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రిక ఈనాడులోనే రాశారు. ఇన్ని రోజులుగా వైఎస్సార్‌సీపీ రైతుల పక్షాన చెబుతున్న మాటలనే యథాతథంగా ఈనాడు కూడా రాసిందంటే ఎంత దయనీయ పరిస్థితులు ఉన్నాయనేది తెలిసిపోతోంది. తేమ శాతం చూపించి ధర తగ్గించడంతో రైతులు నష్టపోతున్నారు. ఎక్కడికెళ్లినా గన్నీ సంచులు దొరకడం లేదు. రవాణా చేద్దామంటే లారీలు లేవంటున్నారు. 75 కిలోల బస్తాకు మద్దతు ధర ప్రకారం రూ.1,777 దక్కాల్సి ఉంటే.. రైతుకు సగటున రూ.1,450 మాత్రమే లభిస్తోంది. ఈనాడు చెప్పే లెక్కల ప్రకారమే రైతు బస్తాకు రూ.250 నష్టపోతున్నాడు. ఈ లెక్కన ఒక్క ధాన్యం 
మీదనే రూ.2,579 కోట్లు వరి రైతు నష్టపోతున్నాడు’ అని వివరించారు.  

Videos

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)