Breaking News

ఆరోగ్యశ్రీ బకాయిలపై సర్కార్‌ బెదిరింపులు.. రేపటి నుంచి సేవలు బంద్‌?

Published on Wed, 08/14/2024 - 16:16

సాక్షి, అమరావతి: ఏపీలో ఆరోగ్యశ్రీపై కూటమి సర్కార్‌ శీతకన్ను వేసింది. బకాయిలు చెల్లించకపోవడమే కాకుండా డబ్బులు అడిగిన ఆసుపత్రులపై బెదిరింపులకు పాల్పడుతున్నారని స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్‌ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే బకాయిలు చెల్లించకపోతే రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని ప్రభుత్వాన్ని అసోసియేషన్‌ హెచ్చరించింది.  

ఈ సందర్భంగా నెట్‌వర్క్‌ ఆసుపత్రులు సభ్యులు మాట్లాడుతూ..‘ఆరోగ్యశ్రీ బకాయిలు అడిగితే వేధిస్తున్నారు. తనిఖీల పేరుతో కేసులు పెడుతున్నారు. వారం వ్యవధిలో పలు ఆసుపత్రుల్లో తనిఖీల పేరుతో హడావుడి చేశారు. అనంతపురంలో చంద్ర, క్రాంతి ఆసుపత్రులపై.. అలాగే విజయవాడలో క్యాపిటల్‌, గుంటూరులో శ్రావణి ఆసుపత్రుల్లో తనిఖీలు చేపట్టారు.

డబ్బులు అడిగినందుకు ఇలా కేసులు నమోదు చేసి బెదిరింపులకు దిగుతున్నారు. ఇక, రాష్ట్రంలో ఇప్పటికే రూ.2500 కోట్లకు ఆరోగ్యశ్రీ బకాయిలు చేరుకున్నాయి. ఇప్పటి వరకు చంద్రబాబు కూటమి సర్కార్ ఆరోగ్యశ్రీకి ఇచ్చింది కేవలం రూ.160 కోట్లు మాత్రమే చెల్లించారు. బకాయిలపై నోరెత్తకుండా వేధిస్తున్నారు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.  
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)