Breaking News

శాసనసభలో ఏపీ మంత్రులకు స్పీకర్‌ మందలింపు

Published on Fri, 11/15/2024 - 10:13

అమరావతి, సాక్షి: ఏపీ శాసనసభ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడికి.. సభలో కూటమి నేతల తీరు ఏమాత్రం సహించడం లేదు. బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం వేళ.. తమ అనుచరుల్ని సభలోకి తోలుకురావడంపై టీడీపీ ఎమ్మెల్యేలపైనే అసహనం వ్యక్తం చేసింది తెలిసిందే. అయితే..

ఇవాళ నాలుగో రోజు సెషన్‌లో మంత్రులపైనే  ఆయన మండిపడినట్లు తెలుస్తోంది. ఉదయం 9.గంకు సభ ప్రారంభం కాగా.. మంత్రుల్లో కొందరు సభకు ఆలస్యంగా వచ్చారు. ఇది గమనించిన స్పీకర్‌.. కాసేపు చూస్తూ ఉండిపోయారు. ఇంతలో కార్మిక శాఖకు సంబంధించిన ప్రశ్న ఎదురుకాగా.. సదరు మంత్రి వాసంశెట్టి సుభాష్‌ ఆ టైంకి సభలో లేరు. 

అనంతరం వచ్చిన మంత్రితో స్పీకర్‌ అయ్యన్న.. క్వశ్చన్ అవర్ ని మంత్రులు సీరియస్ గా తీసుకోవాలని, మంత్రులే ఆలస్యంగా వస్తే ఎలా? అని, సమయం పాటించాలని హితవు పలికినట్లు సమాచారం. ఆలస్యానికి మంత్రి సుభాష్ క్షమాపణ చెప్పి.. మరోసారి ఇలా జరగదంటూ తన సీట్‌లో కూర్చున్నారు.  

ఇక సమావేశాల ప్రారంభ రోజు.. ‘‘మీ అనుచరులను సచివాలయం, ఇతర ప్రాంతాల్లో వుండే విధంగా చూస్కోండి. అసెంబ్లీ హాల్‌లోకి తేకండి’’ అని కాస్త కటువుగానే సొంత  ఎమ్మెల్యేలతో స్పీకర్‌ అయ్యన్న చెప్పారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)