Breaking News

దేశానికే తలమానికంగా అంబేద్కర్ విగ్రహం: విక్టర్ ప్రసాద్  

Published on Sat, 01/06/2024 - 19:45

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన దేశంలోనే అతి ఎత్తైన 125 అడుగుల డా. బీఆర్‌.అంబేద్కర్ విగ్రహం దేశానికే తలమానికంగా నిలవనుందని రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ అన్నారు. ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, విజయవాడలోని తన కార్యాలయంలో శనివారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దాదాపు రూ.400 కోట్లతో స్వరాజ్య మైదానంలో నిర్మించిన అంబేద్కర్ విగ్రహాన్ని ఈ నెల 19న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు.

అంబేద్కర్ విగ్రహాన్ని ఈక్వాలిటీ ఆఫ్ లిబర్టీగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిందని బడుగు, బలహీనవర్గాలవారు అంబేద్కర్ ను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. విజయవాడకే సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచే అంబేద్కర్ విగ్రహాం ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి ప్రతిఒక్కరూ కుల, మత, పార్టీలకతీతంగా స్వచ్ఛందంగా తరలిరావాలని ఆయన ఆకాంక్షించారు.

అంబేద్కర్ భావజాలంతో పరిపాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి జగన్.. అందరివాడైన అంబేద్కర్ స్మృతి వనాన్ని అన్ని సదుపాయాలతో ఏర్పాటు చేశారన్నారు. ప్రతి ఒక్కరినీ ఆకర్షించేలా డా.బీఆర్‌ అంబేద్కర్ జీవిత చరిత్ర తెలిపే మ్యూజియం, మినీ థియేటర్, కన్వెన్షన్ సెంటర్, స్కై లైటింగ్, ఫౌంటెన్లు, లైబ్రరీ వంటి వాటితో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారన్నారు.

గత ప్రభుత్వం అంబేద్కర్ విగ్రహం నిర్మాణం విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదన్నారు. ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ విగ్రహాన్ని ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయడం చారిత్రాత్మకమన్నారు. అటువంటి ఈ గొప్ప కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, కార్మికులు, మహిళలు, ప్రతి ఒక్కరూ పెద్దఎత్తున హాజరై విజయవంతం చేయాలని పేర్కొన్నారు. ఇందులో భాగంగా రేపటి నుంచి ఈ నెల 19వ తేదీ వరకు అన్ని జిల్లాల్లో పండగ వాతావరణంలో పలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని వీటిలో రాజ్యాంగాన్ని గౌరవించే ప్రతి ఒక్కరూ పాల్గొనాలని విక్టర్ ప్రసాద్ స్పష్టం చేశారు.  

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)