Breaking News

‘మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌’లో ఏపీ సత్తా 

Published on Sun, 03/03/2024 - 02:30

సాక్షి, అమరావతి: మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ ఖాతాల్లో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే ఐదో స్థానంలో ఉంది. మొదటి నాలుగు స్థానాల్లో మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా, కర్నాటక రాష్ట్రాలున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ జ్ఞాపకార్థం మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ సర్టిఫికేట్‌ పథకాన్ని 2023–24 బడ్జెట్‌ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. మహిళలు, బాలికల కోసం కొత్తగా ప్రవేశపెట్టిన చిన్న పొదుపు పథకం ఇది. పోస్టాఫీసులతో పాటు నిర్దేశించిన బ్యాంకుల్లో మహిళా సమ్మాన్‌ సేవింగ్‌ సర్టిఫికెట్లను జారీ చేస్తారు.

ఈ ఏడాది జనవరి నెలాఖరు నాటికి దేశ వ్యాప్తంగా 24,13,500 మహిళా సమ్మాన్‌ సేవింగ్‌ సర్టిఫికెట్‌ ఖతాలుండగా.. ఏపీ 1.35 లక్షల ఖాతాలతో దేశంలోనే ఐదో స్థానంలో ఉంది. మహిళా సేవింగ్‌ సర్టిఫికెట్‌ అనేది ఏప్రిల్‌ 2023 నుంచి మార్చి 2025 వరకు రెండేళ్ల పాటు అందుబాటులో ఉంటుంది. స్థిరంగా రెండేళ్ల పాటు మహిళలు, బాలికల పేర్న గరిష్టంగా రూ.2 లక్షల వరకు డిపాజిట్‌ సౌకర్యాన్ని అందిస్తుంది. మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ డిపాజిట్లపై 7.5 శాతం వడ్డీ వస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వ మద్దతుతో కూడిన చిన్న పొదుపు పథకం అయినందున దీనికి ఎలాంటి క్రెడిట్‌ రిస్క్‌ ఉండదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీనిని ఆడపిల్ల లేదా మహిళల పేర్న మాత్రమే చేస్తారు.

ప్రస్తుతం ఉన్న ఖాతా తెరిచినప్పటి నుంచి కనీసం మూడు నెలల తర్వాత ఒక మహిళ లేదా ఆడపిల్ల సంరక్షకుడు రెండో మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ సర్టిఫికేట్‌ ఖాతాను తెరవొచ్చని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. దీని మెచ్యూరిటీ వ్యవధి రెండేళ్లు. అంటే  ఖాతా తెరిచిన తేదీ నుంచి రెండేళ్ల తర్వాత ఖాతాదారుడికి మెచ్యూరిటీ మొత్తం చెల్లిస్తారు. ఆదాయపు పన్ను మినహాయింపు వర్తిస్తుంది. ఖాతా తెరిచిన తేదీ నుంచి ఏడాది తర్వాత ఖాతా బ్యాలెన్స్‌లో 40 శాతం వరకు విత్‌డ్రా చేసుకునే వెసులు బాటు ఉంది.
 
ప్రయోజనాలు..   
మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ ఖాతాలో రూ.2,00,000 పెట్టుబడి పెడితే ఏడాదికి 7.5 శాతం వడ్డీ పొందుతారు. మొదటి సంవత్సరంలో,  అసలు మొత్తంపై రూ.15,000 వడ్డీని పొందుతారు. రెండో సంవత్సరంలో రూ.16,125 వడ్డీని పొందుతారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)