Breaking News

AP: కూటమి సర్కార్‌ లీలలు.. పోలీసుల పహారాలో ఇళ్ల కూల్చివేతలు!

Published on Fri, 02/07/2025 - 08:10

సాక్షి, తిరుపతి: ఏపీలో కూటమి సర్కార్‌ పాలనలో కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. పేదలను టార్గెట్‌ చేస్తూ కొందరు కూటమి నేతలతో ఆదేశాలతో అధికారులు దౌర్జన్యాలకు దిగుతున్నారు. తాజాగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అన్యాయంగా పేదల ఇళ్లను కూల్చివేశారు. అర్ధరాత్రి పోలీసుల బందోబస్తు మధ్య ఇళ్ల కూల్చివేత జరిగింది. ఈ క్రమంలో అధికారుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వివరాల ప్రకారం.. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పేదల ఇళ్లపై కూటమి నేతల దౌర్జన్యం కొనసాగుతోంది. రేణిగుంట మండలం తూకివాకం గ్రామ పంచాయతీ పరిధిలోని గువ్వల కాలనీలో తాజాగా ఇళ్లను అధికారులు కూల్చివేశారు. కూటమి నేతల ఆదేశాలతో రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు, పోలీసులు ఇళ్లలోని వారిని బలవంతంగా ఖాళీ చేయించారు. అనంతరం, అర్థరాత్రి వేళ రేణిగుంట పోలీసుల బందోబస్తు మధ్య ఇళ్లను కూల్చివేశారు.

ఇదిలా ఉండగా, చెన్నై-తిరుపతి మూడవ లైన్ విస్తరణ పనుల్లో భాగంగా ఇల్లు కోల్పోతున్న వారికి ఎలాంటి నష్ట పరిహారం ఇవ్వకుండానే కూల్చివేతలను ప్రారంభించారు. అర్థరాత్రి ఇల్లు కూల్చివేయడంతో  గువ్వల కాలనీవాసులు ఆర్తనాదాలు చేశారు. గువ్వల కాలనీలో 52 కుటుంబాలను ఖాళీ చేయించి ఇంటి సామాన్లను పోలీసులు సహాయంతో అధికారులు బయట పడేశారు. దీంతో, వారి ఆవేదన తెలుసుకుంటున్న మీడియాను సైతం రేణిగుంట పోలీసులు అడ్డుకున్నారు. తమకు నష్ట పరిహారం ఇవ్వకుండా ఇల్లు కూల్చివేస్తున్నట్టు బాధితులు చెబుతున్నారు. తమను బలవంతంగా ఇంట్లో నుంచి బయటకు పంపారని విలపిస్తున్నారు. 

Videos

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)