Breaking News

వరద ముంపులో ఏపీకి ఆరో స్థానం

Published on Thu, 09/19/2024 - 05:34

సాక్షి ప్రతినిధి, అనంతపురం: దేశంలో వరదలు, తుపాన్ల వల్ల ముంపునకు గురవుతున్న రాష్ట్రాల్లో.. ఆంధ్రప్రదేశ్‌ ఆరో స్థానంలో నిలిచింది. దక్షిణాది రాష్ట్రాల్లో ఏకంగా మొదటి స్థానంలో నిలిచిందని నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ, జాతీయ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ వెల్లడించింది. 1998 నుంచి 2022 వరకు వివిధ రాష్ట్రాల్లో సంభవించిన వరదలు, తుపాన్ల వల్ల జరిగిన నష్టాలను తెలియజేసింది. 

దేశంలో అత్యధికంగా బిహార్‌ రాష్ట్రంలో 39 లక్షల హెక్టార్లు, ఉత్తరప్రదేశ్‌లో 26 లక్షల హెక్టార్లు, అస్సాంలో 24 లక్షల హెక్టార్లు, పశ్చిమబెంగాల్‌లో 19 లక్షల హెక్టార్లు, ఒడిశాలో 14 లక్షల హెక్టార్లు, ఏపీలో 8 లక్షల హెక్టార్లలోని ప్రాంతాలు తుపాన్లు, వరదల వల్ల నీటమునిగాయని వెల్లడించింది. ఏపీలో అయితే బాపట్ల, నెల్లూరు జిల్లాలే అత్యధికంగా నీట మునిగాయని తెలిపింది. నెల్లూరు జిల్లాలో 1.4 లక్షల హెక్టార్లు, బాపట్ల జిల్లాలో 1.11 లక్షల హెక్టార్ల భూమి ముంపునకు గురైందని పేర్కొంది. 

ఈ నదులపై తీవ్ర ప్రభావం
ఎడతెగని వర్షాలతో పాటు ఆక్రమణలు, డ్రైనేజీ వ్యవస్థల నిర్వీర్యం, ప్రతికూల వాతావరణం, మా­రు­తున్న భూ వినియోగ విధానాలు, పెరుగుతున్న జనాభా తదితరాల వల్లే వరదలు సంభవిస్తున్నాయని తెలిపింది. గడిచిన 25 ఏళ్లలో భారీ వర్షాల వల్ల గోదావరి, కృష్ణా, వంశధార, నాగావళి నదుల్లో ప్రవాహం పెరిగి.. తరుచూ వరదలు సంభవిస్తున్నాయని పేర్కొంది. రుతుపవనాలు, అల్పపీడనాలు కూడా ఏపీలో వరదలకు దోహదం చేస్తున్నాయని తె­లిí­³ంది.

తీవ్ర విషాదం మిగిల్చిన దివిసీమ ఉప్పెన
1977లో సంభవించిన దివిసీమ(కృష్ణాజిల్లా) ఉప్పెన తీవ్ర విషాదాన్ని మిగిల్చి0ది. వేలాది మంది ప్రాణా లు కోల్పోయారు. ఈ ఉప్పెన..  అంతర్జాతీయ దాత ల దృష్టిని సైతం ఆకర్షించిందని నివేదిక వెల్లడించింది. 1979, 1990, 1996 తుపానులు కూడా ఇలాంటివేనని.. అవన్నీ మరిచిపోయే తుపానులు కాదని జాతీయ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ పేర్కొంది.  

Videos

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)