Breaking News

ఎఫ్‌డీఐల ఆకర్షణలో 14వ స్థానంలో ఏపీ

Published on Wed, 06/11/2025 - 02:35

సాక్షి, అమరావతి: విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ 14వ స్థానంలో నిలిచింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,957.04 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించింది. ఇందులో శ్రీసిటీలో ఏర్పాటు చేసిన డైకిన్,  పానాసోనిక్‌ ,ఏటీసీ టైర్స్‌ వంటి సంస్థల నుంచి ఈపెట్టుబడులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌ (డీపీఐఐటీ) తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2024–25 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా రూ.4,21,929 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి.

అందుకు ముందు ఏడాదితో పోలిస్తే 15 శా­తం వృద్ధి నమోదైంది. మొత్తం విదేశీట్‌ట్టుబడుల్లో 50 శాతానికి పైగా పెట్టుబడులు మహారాష్ట్ర, కర్ణాటకకే రావడం గమనార్హం. మొత్తం పెట్టుబడుల్లో 39.07 శాతం వాటా రూ.1,64,875 కోట్లతో  మహారాష్ట్ర మొదటిస్థానంలో నిలిచింది. 13.27 శాతం వాటా రూ.56,030 కోట్లతో కర్నాటక రెండవస్థానం సాధించింది.  

అత్యధికంగా మారిషస్, సింగపూర్‌ నుంచే.. 
మన దేశంలోకి వస్తున్న విదేశీ పెట్టుబడుల్లో అత్యధికంగా 49 శాతం మారిషస్, సింగపూర్‌ దేశాల నుంచే వస్తున్నాయి. డాలర్ల పరంగా చూస్తే మారిషస్‌ మొదటిస్థానంలో ఉంటే అదే రూపాయల పరంగా చూస్తే సింగపూర్‌ మొదటిస్థానంలో ఉంది.

ఏప్రిల్‌–2000 నుంచి ఇప్పటివరకు మారిషస్‌ నుంచి రూ.10,92,900 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మొత్తం వచ్చిన పెట్టుబడుల విలువలో ఇది 25 శాతం. ఇదే సమయంలో 24 శాతం వాటాతో సింగపూర్‌ నుంచి రూ.12,18,108 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఆ తర్వాత అమెరికా, నెదర్లాండ్స్, జపాన్, బ్రిటన్‌ నుంచి అత్యధికంగా పెట్టుబడులు వచ్చాయి.  సర్వీసు, కంప్యూటర్స్, ట్రేడింగ్, టెలికమ్యూనికేషన్స్, ఆటోమొబైల్‌ రంగాల్లోకి అత్యధికంగా పెట్టుబడులు వస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.  

2024–25లో ఎఫ్‌డీఐ ఆకర్షించిన టాప్‌–5 రాష్ట్రాలు ఇవే..  
మహారాష్ట్ర 1,64,875
కర్నాటక 56,030 
గుజరాత్‌ 51,540 
ఢిల్లీ 47,947 
తమిళనాడు 31,103 

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)