Breaking News

‘ఏపీలో ప్రతీ పథకంలోనూ మహిళలకే పెద్దపీట’

Published on Wed, 03/08/2023 - 13:31

సాక్షి, కృష్ణా:   ఆంధ్రప్రదేశ్‌లో మహిళా సంక్షేమం కోసం ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందన్నారు ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. బుధవారం విజయవాడ ఏపీ ప్రెస్ అకాడమీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. 

ఈ సందర్భంగా.. ఏపీ ప్రభుత్వంపై, సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పైనా కొమ్మినేని ప్రశంసలు గుప్పించారు.  ఏపీ ప్రభుత్వం మహిళల కోసం ఎంతో చేస్తోంది. మహిళలకు సీఎం జగన్ అన్ని రంగాల్లో పెద్దపీట వేశారు. రాజకీయంగా ఎంతో ప్రాధాన్యం కల్పించారు. మార్కెట్ యార్డు పదవులను సైతం మహిళలకు కేటాయించడం చరిత్రలో ఇదే తొలిసారి అని కొమ్మినేని తెలిపారు.   

ఇక ఐఅండ్‌పీఆర్ కమీషనర్ విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. జర్నలిజం వృత్తి అంటేనే ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని, మహిళలు ఆ సవాళ్లను ఎదుర్కొని రాణించడం సంతోషంగా ఉందని అన్నారు. అలాగే.. ఏపీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి మహిళలకు అధికప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. ‘‘ప్రతీ పథకంలోనూ మహిళలకే పెద్దపీట వేస్తున్నారు. 30 లక్షల ఇళ్ల పట్టాలు మహిళల పేరిట ఇచ్చారు అని పేర్కొన్నారు. అలాగే.. మహిళా జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాం అని హామీ ఇచ్చారాయన.  ఈ సందర్భంగా.. వీరిరువురు ప్రెస్ అకాడమీ తరపున పలువురు మహిళా జర్నలిస్టులను సత్కరించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)