నీతో మాట్లాడాలి పోలీస్‌స్టేషన్‌కు రా..

Published on Tue, 11/25/2025 - 05:44

సాక్షి టాస్క్ ఫోర్స్‌: సాక్షి పత్రికలో ప్రచురితమైన ఒక వార్తకు సంబంధించి స్టేషన్‌కు వచ్చి సమాధానం చెప్పాలంటూ శ్రీకాకుళం జిల్లా టెక్కలి సాక్షి విలేకరిని సీఐ, ఎస్‌ఐ బెదిరించా­రు. ఎస్‌ఐ మరో అడుగు ముందుకేసి మరీ దురుసుగా మాట్లాడారు. తొలుత సాక్షి టెక్కలి విలేకరికి ఫోన్‌ చేసిన కోటబోమ్మాళి ఎస్‌ఐ వి.సత్యనారాయణ.. ఒకసారి స్టేషన్‌కు రా.. నీతో మాట్లాడాలి అన్నారు.

దేనికి సార్‌ అని విలేకరి అడగగా.. ‘తినేముందు రుచి చూడటమెందుకు.. ఎలాగో తింటావుగా..’ అన్నారు. దీంతో విలేకరి టెక్కలి రూరల్‌ సీఐ శ్రీనివాసరావుకు ఫోన్‌ చేయగా.. ‘ఈ రోజు యాక్సిడెంట్‌ ఐటమ్‌ ఎవరు రాశారు. మామూళ్ల మత్తులో పోలీసులు అనే విధంగా ఐటెమ్‌ రాశారు. మీకేమైనా ఎవిడెన్స్‌ ఉన్నాయా. కలెక్టర్‌ గారు కోటి రూపాయలు తీసుకున్నారని ఆరోపిస్తే మీరు రాసేస్తారా. మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్‌ ఉన్నా­యా. మీరు ఆన్సర్‌ చేస్తారా. మారి్నంగ్‌ స్టేషన్‌కు రండి..’ అంటూ హుకుం జారీచేశారు.  

అసలు జరిగిందేమిటి? 
కోటబోమ్మాళి మండలం ఎత్తురాళ్లపాడు గ్రామం సమీపంలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో మధ్యప్రదేశ్‌కు చెందిన నలుగురు మృతిచెందారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. జాతీయ రహదారిలో కోటబోమ్మాళి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రోడ్డుపై లారీలు పార్కింగ్‌ చేయడం వల్ల తరచు ప్రమాదాలు జరుగుతున్నాయని, దీనిపై ‘సాక్షి’లో పలుమార్లు కథనాలు వచి్చనా హైవే పెట్రోలింగ్‌ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే అంశంపై సాక్షిలో కథనం ప్రచురితమైంది. ఈ కథనంపైనే అక్కడ ఎస్‌ఐ, సీఐ ఇలా ఫోన్‌చేసి స్టేషన్‌కు వచ్చి సమాధానం చెప్పాలంటూ హుకుం జారీచేశారు. ఇందులో ఎస్‌ఐ సత్యనారాయణ విలేకరితోనే అంత దురుసుగా మాట్లాడుతుంటే ఇక సామాన్యుడి పట్ల ఎలా వ్యవహరిస్తారో అనే సందేహం కలుగుతోంది.

Srikakulam: PSకు వచ్చి కలవాలంటూ సాక్షి ప్రతినిధిని బెదిరించిన CI
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)