Breaking News

విశాఖ బీచ్‌లో రాళ్ల మధ్య యువతి.. 12 గంటల నరకం తర్వాత.. 

Published on Tue, 10/10/2023 - 11:54

సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నంలోని అప్పికొండ బీచ్‌లో ఓ యువతి రాళ్ల మధ్య చిక్కుకున్న ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. రాళ్ల మధ్య అపస్మారక స్థితిలో సదరు యువతి మృత్యువుతో పోరాడింది. అదృష్టవశాత్తు యువతిని స్థానికులు గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే, సదరు యువతి.. మరో యువకుడితో కలిసి బీచ్‌కు వెళ్లడం గమనార్హం. 

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన కావ్య.. వర్మ రాజుతో కలిసి ఈ నెల 2 నుంచి అప్పికొండ శివాలయ పరిసరాల్లో ఉంటున్నారు. ఆదివారం సాయంత్రం తీరం దగ్గరలో ఉన్న రాళ్ల గుట్టలపై ఆమె ఫొటో తీసుకుంటున్న క్రమంలో కిందపడిపోయింది. ఎత్తైన ప్రదేశం నుంచి జారి పడిపోయింది. ఈ క్రమంలో కా​వ్య.. అపస్మారక స్థితికి చేరుకోవడంతో వర్మ రాజు అక్కడి నుంచి పారిపోయడు. అప్పటికే రాత్రి కావడంతో కావ్య రాళ్ల మధ్యలో నుంచి కేకలు వేసింది. 

వర్మ రాజు ఎక్కడ..
బీచ్‌లో రాత్రివేళ జన సంచారం లేకపోవడంతో అలాగే రాత్రంతా మృత్యువుతో పోరాడింది. సోమవారం ఉదయం బీచ్‌కు వచ్చిన కొందరు జాలర్లు యువతిని చూడగా.. అక్కడే ఉన్న గజ ఈతగాళ్ల సహాయంతో అతి కష్టం మీద బయటకు తీసుకొచ్చారు. యువతి రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం, పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. చికిత్స నిమిత్తం 108 వాహనంలో కావ్యను కేజీహెచ్‌కు తరలించారు. ఈ సందర్బంగా తాను కాలుజారి రాళ్ల మధ్య పడిపోయానని.. వర్మ రాజును ఏమీ అనవద్దని ఆమె పోలీసులు కోరడం విశేషం. ఇక పరారీలో ఉన్న వర్మరాజు కోసం పోలీసులు గాలిస్తున్నారు. అంబులెన్సు సిబ్బంది యువతి తల్లికి సమాచారమివ్వగా.. వారు విశాఖ బయలుదేరి వెళ్లారు.

ఇదిలా ఉంటే తమ కుమార్తె కనపడటంలేదని యువతి తల్లి మచిలీపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిడ్నాప్‌ కేసు నమోదు చేశారు.. ఇంతలో పీఎస్‌ నుంచి అంబులెన్స్‌ సిబ్బందికి సమాచారమిచ్చారు. దువ్వాడ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే పరారీలో ఉన్న యువకుడికి ప్రమాదం జరిగిందని.. అతడు కూడా కేజీహెచ్‌లో ఉన్నట్లు సమాచారం. యువతి మిస్సింగ్ కేసు.. విశాఖకు వెళ్లడం ఇప్పుడు మిస్టరీగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Videos

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

22 మున్సిపాలిటీల్లో ఎన్నికలు వాయిదా...?

ఎవరికీ ఏం జరిగిన నాదే బాధ్యత.. దాడి తర్వాత అత్యవసర సమావేశం

పోలీసులకెందుకంత భయం? ఎన్నికల్లో పోటీ చేయనివ్వరా? విశ్వేశ్వర్ రెడ్డి ఫైర్

గడువు పెరుగుతుందా..? నామినేషన్లపై సుప్రీం ఏం చెప్పనుంది..?

టీడీపీ దౌర్జన్యకాండ.. YSRCP అభ్యర్థుల నామినేషన్లు అడ్డుకోవాలని పిలుపు..

నా ఫ్యామిలీని కాపాడండి.. YSRCP అభ్యర్థి షేక్ ఇమామ్ విజ్ఞప్తి

నీకు దమ్ముంటే.. రా, లోకేశ్‌కు వైసీపీ దాసరి అరుణ బహిరంగ సవాల్!

Photos

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)