దళిత మహిళపై సీఐ దౌర్జన్యం

Published on Mon, 01/05/2026 - 05:13

వేమూరు(చుండూరు): దళిత మహిళపై బాపట్ల జిల్లా చుండూరు సీఐ దౌర్జన్యం చేశాడు. ఆమెను దుర్భాషలాడడంతోపాటు తీవ్రంగా కొట్టాడు. బాధితురాలు తెనాలి ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. బాధితురాలు శనివారం ఆస్పత్రిలోని అవుట్‌పోస్టులో పోలీసులకు ఇచి్చన ఫిర్యాదు ప్రకారం..  బాపట్ల జిల్లా చుండూరు మండలం ఆలపాడు గ్రామానికి చెందిన బంక శారద తన భర్త చంద్రకాంత్, అత్త విక్టోరియాపై గత నెల 18న బంగారం చోరీ కేసు పెట్టింది. చుండూరు సీఐ ఆనందరావు 19న శారద, చంద్రకాంత్, విక్టోరియాలను స్టేషన్‌కు పిలిపించి విచారణ చేశారు.

చంద్రకాంత్‌పై సీఐ చేయిచేసుకున్నారు. భార్యాభర్తలు సక్రమంగా కాపురం చేసుకోవాలని హెచ్చరించి పంపించారు. శారద ఇంటికి రాకుండా పుట్టింటికి వెళ్లిపోయింది. బ్రాహ్మణకోడూరు నుంచి తన బంధువులను 10 మందిని తీసుకొని శనివారం చుండూరు పోలీసుస్టేషన్‌కు వచ్చింది. దీంతో సీఐ ఆనందరావు బంక విక్టోరియా, చంద్రకాంత్‌లను స్టేషన్‌కు పిలిపించారు. వారిని ఇష్టం వచ్చినట్లు బూతులు తిట్టారు. విక్టోరియాను పొత్తి కడుపులో పొడిచి, చేతులపై కొట్టారు. తీవ్ర గాయాలు కావడంతో 108 వాహనంలో విక్టోరియాను తెనాలిలోని ప్రభుత్వ వైద్యశాలకు తీసుకు వెళ్లారు. ప్రభుత్వ వైద్య శాలల్లో చికిత్స పొందుతున్న ఆమె అవుట్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.  

సీఐ ఇష్టారాజ్యంగా ప్రవర్తించాడు 
నా భార్య తప్పుడు కేసు పెట్టింది. సీఐ ఆనందరావు విచారణ చేయకుండా శనివారం పోలీసు స్టేషన్‌లో నా తల్లిని దుర్భాషలాడి ఇష్టారాజ్యంగా కొట్టారు. నన్ను కూడా కొట్టారు. మాకు న్యాయం చేయాలి. – బంక  చంద్రకాంత్, ఆలపాడు గ్రామం  

Videos

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)