సీఎం రమేష్‌కు 41ఏ నోటీసులు జారీ..

Published on Sun, 04/07/2024 - 07:28

సాక్షి, అనకాపల్లి: అనకాపల్లి పార్లమెంట్‌ స్థానానికి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న సీఎం రమేష్‌ వ్యవహార శైలి వివాదాస్పదంగా మారింది. ఇటీవల చోడవరంలో ఓ ఘటనలో కేసు నమోదు కాగా శనివారం నర్సీపట్నంలో కృష్ణా ప్యాలెస్‌లో బీజేపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో కార్యకర్తలకు చీరల పంపిణీ కార్యక్రమం వివాదానికి దారి తీసింది. విషయం తెలుసుకున్న నర్సీపట్నం టౌన్‌ సీఐ క్రాంతి కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ రవిబాబుతో పాటు ఎన్నికల యంత్రాంగం అక్కడికి చేరుకుని తీయడంతో సీఎం రమేష్‌ అధికారులపై చిందులు తొక్కారు. ఓటర్లుకు సింబల్‌ తెలియజేయడానికి కమలం గుర్తు కలిగిన చీరలు ఇవ్వడం తప్పా అని ప్రశ్నించారు. ఇవి తాయిలాలు కాదని అధికారులపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సీఎం రమేష్‌కు 41ఏ నోటీసులు జారీ..
అనకాపల్లి జిల్లా చోడవరంలో జీఎస్టీ చెల్లించకుండా అనధికారికంగా టైల్స్‌ వ్యాపారం చేస్తున్న బుచ్చిబాబు ట్రేడర్స్‌లో తనిఖీలు నిర్వహిస్తున్న డీఆర్‌ఐ అధికారులపై దాడికి దిగడమే కాకుండా, విధులకు ఆటంకం కలిగించిన వ్యవహారంలో సీఎం రమేష్‌కు శనివారం రాత్రి పోటీసులు 41ఏ నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో ఈనెల తొమ్మిదో తేదీన విచారణను హాజరు కావాలని అనకాపల్లి ఎస్‌డీపీవో ఆదేశించారు. కాగా, ఐపీసీలోని 353,342,506,201,188, 143/rw, 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సీఎం రమేష్, చోడవరం టీడీపీ అభ్యర్థి రాజు సహా ఆరుగురి పేర్లను పోలీసుల ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)