ఐపీఎస్‌ సిద్ధార్థ్‌ కౌశల్‌ వీఆర్‌ఎస్‌.. ఏపీ పోలీస్‌ బిగ్‌ బాస్‌ ఎంట్రీ!

Published on Thu, 07/03/2025 - 07:57

సాక్షి, అమరావతి: వేధింపులు, అవమానాలతో ఐపీఎస్‌ సర్వీసుకు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్న తర్వాత కూడా జీపీపీ కార్యాలయంలో ఎస్పీ (అడ్మిన్‌) సిద్ధార్థ్‌ కౌశల్‌పై ప్రభుత్వ పెద్దలు తమ ప్రతాపం చూపించారు. ‘ఐపీఎస్‌కు సిద్ధార్థ్‌ కౌశల్‌ గుడ్‌ బై’ అనే శీర్షికతో ‘సాక్షి’ పత్రిక బుధవారం ప్రచు­రించిన కథనం పోలీసు శాఖలో తీవ్ర కలకలం సృష్టించింది.

అసలు రాష్ట్ర పోలీసు శాఖలో ఏం జరు­గుతోంది.. ఎటువంటి పరిణామాలకు దారితీస్తోందని పోలీసు వర్గాలు తీవ్రస్థాయిలో చర్చించుకున్నాయి. రానున్న రోజుల్లో పోలీసు శాఖలో పరిస్థితులు మరింతగా దిగజారుతాయని ఆవేదన వ్యక్తంచేశాయి. తమ వేధింపుల వ్యవహారం మరోసారి బట్టబయలు కావడంతో హడలిపోయిన ప్రభుత్వ పెద్దలు వెంటనే పోలీస్‌ బిగ్‌ బాస్‌ను రంగంలోకి దించారు.

కేవలం వ్యక్తిగత కారణాలతోనే ఐపీఎస్‌ సర్వీసు నుంచి స్వచ్ఛందంగా వైదొలుగుతున్నట్టుగా ప్రకటించాలని సిద్ధార్థ్‌ కౌశల్‌పై డీజీపీ కార్యాలయం తీవ్ర ఒత్తిడి తెచ్చింది. తాము చెప్పినట్టు ప్రకటన జారీ చేయకపోతే స్వచ్ఛంద ఉద్యోగ విరమణ (వీఆర్‌ఎస్‌) కోసం ఆయన చేసిన దరఖాస్తును ఆమోదించబోమని కూడా బెదిరించినట్టు తెలుస్తోంది. పోలీస్‌ బిగ్‌ బాస్‌ ఒత్తిడికి ఆయన తలొగ్గారు. అనంతరమే సిద్ధార్థ్‌ కౌశల్‌ పేరుతో ఓ పత్రికా ప్రకటనను పోలీసు వర్గాలు విడుదల చేశాయి. సిద్ధార్థ్‌ కౌశల్‌పై డీజీపీ కార్యాలయం తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చి ఆయనతో పత్రికా ప్రకటన జారీ చేయించిందని పోలీసు వర్గాలే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నాయి.  

కుటుంబ సభ్యుల అభిప్రాయం మేరకే వీఆర్‌ఎస్‌: సిద్ధార్థ్‌ కౌశల్‌  
సుదీర్ఘంగా ఆలోచించి, కుటుంబ సభ్యుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఐపీఎస్‌ ఉద్యోగానికి స్వచ్ఛందంగా రాజీనామా చేశానని సిద్ధార్థ్‌ కౌశల్‌ బుధ­వారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇది వ్యక్తిగత కారణాలతో తీసుకున్న స్పష్టమైన నిర్ణయమని పేర్కొన్నారు. ఐపీఎస్‌ అధికారిగా పని చేయడం తన జీవితంలో అత్యంత గౌరవప్రదమైన అనుభవమన్నారు. తనకు సహ­కరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.   

 

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)