Breaking News

బాబు సర్కారు బా‘గో’తం

Published on Tue, 11/18/2025 - 05:18

తగరపువలస: ఆనందపురం మండలం శొంఠ్యాం పంచాయతీలో శ్రీమిత్ర మెరైన్‌ ఏజెన్సీస్‌ కోల్డ్‌ స్టోరేజ్‌ నుంచి రెండు వారాల క్రితం సీజ్‌ చేసిన 1.89 లక్షల కిలోల గో మాంసంపై చంద్రబాబుతోపాటు ఆయన సర్కారు అద్భుతంగా నటిస్తోందని, హిందువుల మనోభావాలు దెబ్బతీస్తోందని హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు దుయ్యబట్టారు. కోల్డ్‌ స్టోరేజ్‌ ముందు విశ్వహిందూ పరిషత్, సమరసత అభియాన్, ప్రాంత మందిర, అర్చక పురోహిత్‌ సురక్ష తదితర హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు సోమవారం ఆందోళన చేపట్టారు.

గో మాంసం సీజ్‌ చేయడం ఒక బూటకమన్నారు. హిందువులు ఆవులను గోమాతగా పూజిస్తుంటే చంద్రబాబు ప్రభుత్వంలోని బాపట్ల ఎమ్మెల్యే నరేంద్రవర్మ అతని అనుచరుడు తటవర్తి సుబ్రహ్మణ్య గుప్తా లక్షల గోవులను వధించి విదేశాలకు మాంసం అమ్ముకుంటున్నారని విమర్శించారు. గో మాంసం సీజ్‌ చేయడం అంటే తెరచుకునే తాళాలు వేయడం కాదని ఎద్దేవా చేశారు. పశు సంవర్థకశాఖ, పోలీసులను బలిపశువులు చేసిన చంద్రబాబు ప్రభుత్వం హిందువుల మనోభావాలతో అడుకుంటోందని ధ్వజమెత్తారు. కూటమిలో భాగస్వామి అయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, డిప్యూటీ సీఎం పవన్, స్థానిక ఎమ్మెల్యే స్పందించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.

సీఐఐ సదస్సు పేరుతో రాష్ట్ర కేబినెట్‌ విశాఖకు తరలివచ్చినా హిందువుల ఆందోళనను పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. ఈ విషయాన్ని దేశంలోని ఇతర హిందూ ధార్మిక సంస్థలతో కలిసి ప్రధాని మోదీ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. అధికారపక్ష ఎమ్మెల్యే అనుచరునికి చెందిన ఈ కోల్డ్‌ స్టోరేజ్‌ వల్ల పక్కనే ఉన్న సింహాచలంలోని గోవులకూ ముప్పు పొంచి ఉందన్నారు. సీజ్‌ అంశంపై నిజానిజాలు తేలేవరకు ఆందోళన విరమించబోమని స్పష్టం చేశారు. ఇప్పటికైనా గో మాంసం రవాణా చేస్తున్న సుబ్రహ్మణ్య గుప్తాను అరెస్ట్‌ చేసి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. 

కోల్డ్‌ స్టోరేజ్‌ వద్ద నాటకీయ పరిణామాలు 
తమను కోల్డ్‌ స్టోరేజ్‌ లోపలికి పంపిస్తే సీజ్‌ చేసిన గో మాంసం ఉందా లేదా పరిశీలిస్తామని గంటన్నర పాటు ధార్మిక సంస్థల ప్రతినిధులు ఆందో­ళన చేస్తే చివరకు ఐదుగురిని మాత్రమే సెల్‌ఫోన్‌లు లేకుండా లోపలికి అనుమతించారు. దీంతో పరిశీలించి వచి్చన వారు మాట్లాడుతూ సీజ్‌ చేసిన గో మాంసం ఎక్కడికో తరలించినట్టు అనుమానం వ్యక్తం చేశారు. సీజ్‌ చేసినట్లుగా చెప్పుకొస్తున్న మాంసానికి అసలు లక్క వంటి సీలు లేక కేవలం ఒక్క తాళం మాత్రమే వేసినట్టు ఉందన్నారు.  కార్యక్రమంలో ధార్మిక సంస్థల రాష్ట్ర నాయకులు పూడిపెద్ది శర్మ, మీసాల రవీంద్ర, జిల్లా నాయకులు గాడు వెంకట నారాయణ, పీవీవీ ప్రసాదరావు, ఫణీంద్ర, ఎం.రామకృష్ణ, బి.సుబ్రహ్మణ్యం, శీరపు రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)