Breaking News

 ‘కమాండో కాంపిటీషన్స్‌’లో సత్తా చాటిన ఏపీ

Published on Wed, 01/31/2024 - 06:25

విశాఖ స్పోర్ట్స్‌: 14వ ఆల్‌ఇండియా పోలీస్‌ కమాండో కాంపిటీషన్స్‌ (ఏఐపీసీసీ)లో ఏపీ జట్టు ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ సాధించింది. 300 పాయింట్లకు గాను 267.20 పాయింట్లతో ఏపీ పోలీస్‌ కమాండో జట్టు విజయకేతనం ఎగురువేసింది. ఈ పోటీల్లో 8 ట్రోఫీలకు గానూ నాలుగింట చాంపియన్‌గా నిలి­చింది. విశాఖలోని గ్రేహౌండ్స్‌ ప్రధాన కార్యాలయ మైదానంలో మంగళవారంతో ముగిసిన ఈ పోటీ­ల్లో విజేతలకు ఇంటెలిజెన్స్‌ బ్యూరో ఏడీజీపీ మ హేష్‌ దీక్షిత్‌ ట్రోఫీలను అందజేశారు. 9 రోజుల పా టు 23 ప్రత్యేక దళ కమాండో (16 స్టేట్, 7 పారా మిలిటరీ ఫోర్స్‌) జట్లు.. 5 దశల్లో జరిగిన పోటీల్లో సత్తాచాటాయి.

ఆర్పీఎఫ్‌కు చెందిన కమాండో బి జేంద్ర 9.05 (12 నిమిషాలకు) నిమిషాల్లోనే పూర్తి చేసి ఛీతా రన్‌ ట్రోఫీని కైవసం చేసుకున్నాడు. కమాండో కాంపిటీషన్స్‌ విజేతగా ఏపీ నిలిచి స్వర్ణాలను అందుకుంది. రన్నరప్‌గా మహా­రాష్ట్ర నిలిచి రజతాన్ని, సెకండ్‌ రన్నరప్‌గా రాజస్థాన్‌ కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. కాన్ఫిడెన్స్‌ కోర్స్‌ బెస్ట్‌ జట్టుగా 10 నిమిషాల 10 సెకన్ల వ్యవధితో ఏపీ జట్టు నిలిచింది. బెస్ట్‌ స్టేట్‌ పోలీస్‌ కమాండో జట్టుగా 300కు గానూ 267.20 మార్కులతో ఏపీ జట్టు కైవసం చేసుకుంది.

స్మాల్‌ టీమ్‌ ఆపరేషన్స్‌కు ఇచ్చే రణ్‌నీతి ట్రోఫీని బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ కైవసం చేసుకోగా.. చక్రవ్యూహ్‌ (గ్రామీణ) ట్రోఫీని ఏపీ జట్టు, చక్రవ్యూహ్‌ (పట్టణ) ట్రోఫీని మహారాష్ట్ర జట్టు కైవసం చేసుకుంది. బ్లాక్‌ హాక్‌ ఫైరింగ్‌ ట్రోఫీని 93 మార్కు­లతో­(110కి­గానూ) ఏపీజట్టు అందుకుంది. ఏపీ జట్టు­లోని 13 మంది (11+2) సభ్యులకు ఒక్కోక్కరికి రూ.5 లక్షల ప్రోత్సాహాంతో పాటు 3 అదనపు ఇంక్రిమెంట్లను సర్వీస్‌ బోర్డ్‌ ప్రకటించింది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)