Breaking News

నైపుణ్య శిక్షణ కేంద్రాలతో సత్ఫలితాలు 

Published on Wed, 02/21/2024 - 05:12

నరసాపురం రూరల్‌: నైపుణ్యంతో దేశం నవనిర్మాణ కల్పన జరుగుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలంలోని పెదమైనవానిలంక గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. చేతి వృత్తిదారులకు ఆర్థిక భరోసా, భవిష్యత్తును కల్పించాలనే లక్ష్యంతో రూపొందించిన పథకమే పీఎం విశ్వకర్మ యోజన అని నిర్మలాసీతారామన్‌ చెప్పారు.

ఈ పథకం రిజిస్ట్రేన్‌లలో ఏపీ దేశంలో మొదటి స్థానంలోను, పశ్చిమ గోదావరి జిల్లా రాష్ట్రంలో మొదటిస్థానంలోను నిలిచిందన్నారు. తాను ‘సన్‌సద్‌ ఆదర్శ గ్రామ యోజన’లో భాగంగా పీఎం లంక గ్రామాన్ని దత్తత తీసుకున్నట్లు తెలిపారు. మూడేళ్లుగా గ్రామాభివృద్ధికోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. గ్రామంలో డిజిటల్‌ భవన  నిర్మాణాన్ని పూర్తి చేసి అందులో నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. 

రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ మాట్లాడుతూ గ్రామంలోని డిజిటల్‌  భవనంలో వేలాది మందికి వృత్తి నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలను కల్పించడం మంచి పరిణామం అన్నారు. స్థానిక ఎమ్మెల్యే, చీఫ్‌విప్‌ ముదునూరి ప్రసాదరాజు మాట్లాడుతూ ఈ గ్రామాభివృద్దికి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ ఎంతగానో సహకరించారని తెలిపారు. కార్యక్రమంలో ఆర్ధిక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రావత్, ఆరి్ధకశాఖ కార్యదర్శి సత్యనారాయణ, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్యదర్శి సురే‹Ùకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.  

Videos

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)