Breaking News

పట్టణ పేదల ఇళ్ల నిర్మాణంలో ఏపీనే నంబర్‌ వన్‌

Published on Thu, 06/20/2024 - 05:41

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబం సొంతింట్లో నివసించాలని, అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఉండాలనే తలంపుతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల నిర్మాణం రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టింది. పట్టణ పేదల ఇళ్ల నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్‌ నంబర్‌ 1 అని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.  పట్టణ పేదల ఇళ్ల నిర్మాణాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఉత్తమ పనితీరు కనపరిచిందని ప్రశంసించింది. 

ప్రధాన మంత్రి అవాస్‌ యోజన (పట్టణ) కింద భారత దేశంలో వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో గణనీయమైన పురోగతి సాధించినట్లు తెలిపింది. పేదలందరికీ ఇళ్లు అనే విస్తృత లక్ష్యం పట్ల రాష్ట్రాలు సామూహిక నిబద్ధతను ప్రతిబింబిస్తున్నాయని పేర్కొంది. పట్టణ పేదల ఇళ్ల నిర్మాణాల్లో  ఉత్తమ పనితీరు కనపరుస్తున్న పది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉందని తెలిపింది. రెండో స్థానంలో ఉత్తరప్రదేశ్‌ ఉన్నట్లు పేర్కొంది. 

ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన (పట్టణ) కింద ఈ ఏడాది జూన్‌ 10 నాటికి దేశవ్యాప్తంగా 1.18 కోట్ల ఇళ్లు మంజూరు చేయగా ఇందులో 1.14 కోట్ల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయని కేంద్రం పేర్కొంది. ఇందులో 83.67 లక్షల ఇళ్లు నిర్మాణాలు పూర్తయ్యాయని తెలిపింది. ఈ పథకం కింద 1,99,652 కోట్లు వ్యయం చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు 1,63,926 కోట్లు విడుదల చేసినట్లు తెలిపింది. ఇందులో 1,51,246 కోట్లు వ్యయం చేసినట్లు పేర్కొంది. అదనంగా మరో 16 లక్షల ఇళ్లు కొత్త సాంకేతిక పరిజాŠక్షనాన్ని ఉపయోగించి నిర్మిస్తున్నట్లు వెల్లడించింది.

రాష్ట్రంలో 31 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలు
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పేదలందరికీ ఇళ్లు పేరుతో ఏకంగా 31 లక్షలకు పైగా స్థలాలను మహిళల పేరిట పంపిణీ చేసి, 17005 కాలనీల్లో పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణాన్ని ఓ యజ్ఞంలా చేపట్టింది. ఇందు కోసం వేల ఎకరాల ప్రైవేటు భూములను సైతం సేకరించింది. ఈ ఏడాది మే నెలాఖరుకి 21.31 లక్షల ఇళ్ల నిర్మాణానికి రూ.12,295.87 కోట్లు వ్యయం చేసింది. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా ఉంది. పేదల ఇళ్ల కోసం ఊర్లను తలపించేలా పెద్ద కాలనీలు అభివృద్ధి చేసింది. 

ఆ కాలనీల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పించేందుకు చర్యలు చేపట్టింది. తొలి దశలో 15 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసింది. ఇంత పెద్ద ఎత్తున పేదల ఇళ్ల నిర్మాణం ఇప్పటివరకు దేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగలేదు. పేద అక్కచెల్లెమ్మల సొంతింటి కల నెరవేర్చడానికి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపట్టిన చర్యలే ఇప్పుడు రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలబెట్టింది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)