Breaking News

ఓ మంత్రిగారు.. చించినాడ పూతరేకులు..

Published on Mon, 02/10/2025 - 06:03

సాక్షి, భీమవరం :  ‘చంద్రబాబునాయుడుగారు, పవన్‌కళ్యాణ్‌గారు చెప్పారమ్మా.. మీ వలంటీరు జాబ్‌కు రూ.5 వేలు ఏ మూలకి సరిపోతాయి? ఖర్చులు బోలెడు పెరిగిపోయాయి కదా? మన ప్రభుత్వంలో వలంటీరు వ్యవస్థను కొనసాగిస్తాం. మీకు రూ.10 వేలు జీతం ఇస్తాం. రేపొద్దున్న మన ప్రభుత్వంలో అన్నయ్య ఇదిగో 10 వేలు అందుకున్నానని ఆనందంగా మన చించినాడ పూతరేకుల ప్యాకెట్‌ పట్టుకుని రావాలి’.. అంటూ పాలకొల్లు నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యేగా నిమ్మల రామానాయుడు(Nimmala Rama Naidu)ఎక్కడ వలంటీరు కనిపించినా ఈ హామీ ఇచ్చేవారు.

రూ.10 వేలు తీసుకున్నాక ఆనందంగా చించినాడ పూతరేకుల ప్యాకెట్‌ కానుకగా ఇవ్వాలని చెప్పి ఆకట్టుకునే ప్రయత్నం చేసేవారు. అప్పట్లో ఆయన పాలకొల్లు కళాకారులనే మించిపోయారు. ఇంటింటికీ వెళ్లి అమ్మ, అక్క, చెల్లి, బావ, తమ్ముడు.. అని అందరితో వరసలు కలుపుతూ సూపర్‌ సిక్స్‌లో ఎవరెవరికి ఎంత నగదు వస్తుందో తనదైన శైలిలో వివరించేవారు. ఆనక ఆ వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్టులు చేయించుకునే వారు. ఇప్పుడదే ఆయన్ను వెంటాడుతోంది.

పాలన పగ్గాలు చేపట్టి ఎనిమిది నెలలు కావస్తోంది. ఆర్థిక పరిస్థితి చూస్తుంటే హామీల అమలు సాధ్యంకాదంటూ సీఎం చంద్రబాబు చేతులెత్తేయ్యడంతో సూపర్‌సిక్స్‌ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ప్రజలు సోషల్‌ మీడియా వేదికగా తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్, నిమ్మల ప్రసంగాలు, వాటి అమలుకు ఇప్పుడు చేతులెత్తేసిన దృశ్యాలతో రీల్స్‌ ద్వారా ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు.  

మంత్రి నిమ్మలకు రీల్స్‌ సెగ.. 
ఇక పాలకొల్లులోని ఒక ఇంటి వద్ద ఉన్న చిన్నపిల్లలను చూపిస్తూ నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు అంటూ నాడు నిమ్మల రామానాయుడు చెప్పిన వీడి­యో ఎంత పాపులర్‌ అయ్యిందో తెలిసిందే. తలి­్లకి వందనం ఇప్పట్లో రాదని తెలిసి ఆ వీడియో­కు గోదావరి వెటకారం, యాసను జోడించి మరీ నెటిజన్లు రీల్స్‌ చేసి మంత్రి నిమ్మలకు వ్య­తిరేకంగా పోస్టు చేస్తున్నారు. కొందరైతే త­మ సెల్‌ఫోన్లకు ఈ ఆడియోను రింగ్‌టోన్లుగా పె­ట్టేసుకున్నారు.

ఇలా గత రెండ్రోజులుగా ని­మ్మల హామీకి సంబంధించిన వీడియోలు సో­ష­ల్‌ మీడియాలో ట్రెండవుతున్నాయి. అలాగే, మ­న ప్రభుత్వంలో మీకు రూ.10 వేలు వేతనం వచ్చిన ఆనందంతో కానుకగా తనకు చించినాడ పూ­తరేకులు తీసుకొచ్చి ఇవ్వాలంటూ వలంటీర­్లతో చెప్పిన వీడియోలను జతచేసి సోషల్‌ మీ­డి­యాలో వేల సంఖ్యలో షేర్‌ అవుతున్నాయి. 

వ­లంటీర్లను కొందరు కూటమి నేతలు వంచించి­న తీరును ఎండగడుతుండగా, మరికొందరు వా­టికి మద్దతుగా కామెంట్లు పెడుతూ నిరసన తె­లుపుతున్నారు. పూతరేకులు దొరక్క కలవలేక­పోయారంటూ వంటి పోస్టులతో ఆడుకుంటున్నా­రు. అధికారం కోసం హామీలిచ్చేయ్యడం, గ­ద్దెనెక్కాక వాటిని విస్మరించడం పూర్వపు రో­జు­లని.. ఇప్పుడు సోషల్‌ మీడియా నుంచి త­ప్పించుకోలేరంటూ సెటైర్లు వేస్తున్నారు.

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)