Breaking News

మోడల్‌ స్కూల్‌ విద్యార్థినులకు అరుదైన అవకాశం

Published on Sun, 01/26/2025 - 05:44

కంచిలి: శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలంలోని మఠం సరియాపల్లిలోని ఏపీ మోడల్‌ స్కూల్‌ విద్యార్థినులు అమెజాన్‌ ఫ్యూచర్‌ ఇంజనీర్‌ ప్రాజెక్టు రూపకల్పన చేసే అరుదైన అవకాశాన్ని పొందారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖాదికారి టి.తిరుమల చైతన్య నుంచి పాఠశాలకు శనివారం ఉత్తర్వులు అందాయి. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌లో భాగంగా అమెజాన్‌ ఫ్యూచర్‌ ఇంజనీర్‌ ప్రాజెక్టు రూపకల్పన చేసి ప్రదర్శించేందుకు ఇక్కడి విద్యార్థినులకు అవకాశం లభించింది. పాఠశాల విద్యా శాఖ తరఫున జిల్లాలో మఠం సరియాపల్లి ఏపీ మోడల్‌ స్కూల్‌ విద్యార్థినులు ఐదుగురు, పొన్నాడ కేజీబీవీ విద్యార్థినులు ఐదుగురు ఎంపికైనట్టు ఉత్తర్వులు వెలువడ్డాయని ప్రిన్సిపాల్‌ శివప్రసాద్‌ వెల్లడించారు.

వీరు ఈ నెల 26నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు బెంగళూరులో జరిగే ఇంటర్‌స్టేట్‌ హాకథాన్‌ ప్రోగ్రామ్‌లో పాల్గొనబోతున్నట్టు తెలిపారు. పాఠశాలకు చెందిన ఆరాధ్య పాణిగ్రాహి (9వ తరగతి), శ్రద్ధాంజలి మహంతి (9వ తరగతి), యాస్మిన్‌ చౌదరి (7వ తరగతి), రితిక బడిత్య (9వ తరగతి), మహంతి శ్రద్ధాంజలి (9వ తరగతి), గైడ్‌ టీచర్‌ బడియా సత్యనారాయణ ఈ ప్రాజెక్టు ప్రదర్శనకు ఎంపికయ్యారు. ఐదుగురు విద్యార్థినులు, గైడ్‌ టీచర్‌ బెంగళూరు వెళ్లి రావడానికి ఉచిత విమాన ప్రయాణం, ఫైవ్‌ స్టార్‌ వసతి కల్పించనున్నారు. 

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)