Breaking News

భోగాపురంపై నీళ్లు నమిలిన మంత్రులు

Published on Tue, 01/06/2026 - 03:36

సాక్షి, అమరావతి: భోగాపురం ఎయిర్‌పోర్టు విషయంలో మీడియా అడిగిన ప్రశ్నలకు మంత్రులు బీసీ జనార్దన్‌రెడ్డి, కింజరాపు అచ్చెన్నాయుడు నీళ్లు నమిలారు. ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక దాటవేత ధోరణి అవలంబించారు. సచివాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ ప్రాజెక్ట్‌కు కర్త, కర్మ, క్రియ చంద్రబాబే అని భజన చేశారు. ఈ విషయం చిన్న పిల్లాడిని నిద్రలో లేపి అడిగినా చెబు­తాడని ప్రగల్భాలు పలికారు. దీంతో మీడి­యా ప్రతినిధులు కల్పించుకుని ‘ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణానికి భూములు ఇచ్చిన వారికి పునరావాసం, భూసేకరణ కోసం గత ప్రభుత్వంలో రూ.960 కోట్లు ఖర్చు చేశామని వైఎస్సార్‌సీపీ చెబుతోంది.’ వాస్తవం కాదా? అని మీడియా ప్రశి్నంచగా మంత్రులు నీళ్లు నమిలారు.

ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణంపై హైకోర్టు, ఎన్జీటీల్లో కేసులను ఎవరి హయాంలో అధిగమించారు? అన్న ప్రశ్నకు సమాధానం దాట వేశారు. ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రధాన పనుల్లో గణనీయమైన భాగం గత ప్రభుత్వంలోనే పూర్తయినట్టు ప్రతిపక్షం చెబుతోందని మీడియా ప్రస్తావించగా అచ్చెన్నాయుడు కస్సుబుస్సులాడారు. వాస్తవాలను అంగీకరించలేక మాజీ సీఎం వైఎస్‌ జగన్‌పై వ్యక్తిగత దూషణకు దిగారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ ఘనత అంతా బాబుకే దక్కాలన్నారు. సీమ ఎత్తిపోతల పథకంపై మీడి­యా వేసిన ప్రశ్నలతో అచ్చెన్నాయుడు అసహనానికి గురయ్యారు.

రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను చంద్రబాబుతో మాట్లాడి ఆపించేశానని తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి ఆ రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారని దీనిపై మీ స్పందన ఏమిటని మీడియా ప్రతినిధులు అచ్చెన్నను ప్రశ్నించగా ‘వెళ్లి ఆయన్నే అడుక్కోండి’ అని వారిపై కస్సుమన్నారు.  తన రాజకీయ ప్రయోజనాల కోసం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం తమకు లేదన్నారు. రేవంత్‌ రెడ్డి ప్రకటన చేసిన వెంటనే చంద్రబాబు సీమ ద్రోహి అని రాసేస్తారా? అంటూ చిందులు తొక్కారు.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)