కుప్పం దొంగల ముఠా కేసులో కీలక పురోగతి

Published on Thu, 06/05/2025 - 11:27

సాక్షి, చిత్తూరు: కుప్పంలో పోలీసుల మీదకే వాహనంతో దూసుకెళ్లిన దొంగల ముఠా కోసం గాలింపు కొనసాగుతోంది. ఆ ముఠాలో ఐదుగురు సభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి పోలీసులు పురోగతి సాధించారు.

కుప్పం రైల్వే స్టేషన్‌లో ముఠా సభ్యుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. శుక్రవారం ఉదయం పుష్‌పుల్‌ రైలులో బెంగళూరు వెళ్లే ప్రయత్నంలో ఉండగా.. అదుపులోకి తీసుకున్నారు. అతని ద్వారా మిగిలిన ముఠా సభ్యుల ఆచూకీ కనిపెట్టే ప్రయత్నంలో ఉన్నారు. 

కరుడుగట్టిన దొంగల ముఠా ఒకటి సరిహద్దు దాటుతున్నారనే సమాచారంతో కుప్పం పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. మంగళవారం అర్ధరాత్రి సమయంలో కృష్ణగిరి-పలమనేరు జాతీయ రహదారిపై ఉన్న తంబిగానిపల్లె చెక్‌పోస్టు వద్ద పోలీసులను చూసి దుండగులు తమ కారుతో తొక్కించేందుకు విఫలయత్నం చేశారు. వెంటనే కానిస్టేబుళ్లు పక్కకు తప్పుకోవడంతో ప్రమాదం తప్పింది. ఈ నేపథ్యంలో తప్పించుకున్న వారిని నిలువరించేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. 

ఈ కాల్పుల్లో కారు నడుపుతున్న డ్రైవర్‌ తొడకు బుల్లెట్‌ గాయమైంది. అయినా కూడా ఆ ముఠా తప్పించుకుంది.  కొద్దిదూరం వెళ్లాక కారును వదిలేసి ఆ ముఠా సభ్యులు పరారైనట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కుప్పం డీఎస్పీ పార్థసారథి మాట్లాడుతూ హత్యాయత్నం కింద దొంగలపై కేసు నమోదు చేశారు.  

పోలీసులు పలు బృందాలుగా ఏర్పడి సమీప ప్రాంతాల్లో దొంగల కోసం జల్లెడ పడుతున్నారు. కుప్పం పరిధిలోని పలు గ్రామాల్లో డ్రోన్ కెమెరాలు, డాగ్ స్క్వాడ్‌తో గాలింపు చేపట్టారు. ఆ ముఠాలో హర్యానా, రాజస్థాన్‌ ముఠా సభ్యులు ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. హిందీలో మాట్లాడుతూ ఎవరైనా అనుమానాస్పద రీతిలో ఎవరైనా కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు.

Videos

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)