Breaking News

ఏపీ పోలీసుల కోర్టు ధిక్కారం!.. తురకా కిషోర్‌పై కొత్త కుట్ర

Published on Fri, 08/08/2025 - 12:30

సాక్షి, గుంటూరు: హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్‌ను జైలు అధికారులు విడుదల చేయలేదు. హైకోర్టు తక్షణమే విడుదల చేయమని ఆదేశాలు ఇచ్చినా జైలు అధికారులు కిషోర్‌ను విడుదల చేయకపోవడంపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తురకా కిషోర్ తరపున న్యాయవాది.. హైకోర్టు ఉత్తర్వులను గురువారం రాత్రి 12 గంటల సమయంలో జైలుకు అందించినప్పటికీ విడుదల చేయడం లేదు. కాగా, తమ పేరుతో రిలీజ్‌కు డైరెక్షన్ ఇవ్వలేదు కాబట్టి తాము విడుదల చేయలేమని జైలు అధికారులు వింతగా జవాబు ఇవ్వడం గమనార్హం.

అంతకుముందు.. తురకా కిషోర్‌పై ఎప్పుడో ఏడాదిన్నర క్రితం ఘటన జరిగితే ఇప్పుడు కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసిన వ్యవహారంలో అటు పోలీసులు, ఇటు మేజిస్ట్రేట్‌ తీరును హైకోర్టు తప్పుపట్టింది. కిషోర్‌ను తక్షణమే విడుదల చేయాలని ఆదేశాలిచ్చింది. ఆయన అరెస్ట్‌ సీఆర్‌పీసీ, బీఎన్‌ఎస్‌ఎస్‌ నిబంధనలతో పాటు సుప్రీంకోర్టు ఆదేశాలకు సైతం విరుద్ధమని తేల్చి చెప్పింది. ఇందులో ఎలాంటి సందేహం లేదంది. కిషోర్‌ రిమాండ్‌ విషయంలో మేజిస్ట్రేట్‌ మెదడు ఉపయోగించలేదని ఆక్షేపించింది.

బెయిల్‌ కోసం పిటిషన్‌ దాఖలు చేయలేదు కాబట్టి, రిమాండ్‌ విధిస్తున్నట్లు పేర్కొన్న మేజిస్ట్రేట్‌, ఈ విషయంలో తన సంతృప్తిని ఎక్కడా రికార్డ్‌ చేయలేదని పేర్కొంది. కిషోర్‌ విడుదల ఈ వ్యాజ్యంలో తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ రావు రఘునందన్‌రావు, జస్టిస్‌ తూటా చంద్ర ధనశేఖర్‌తో కూడిన ధర్మాసనం గురువారం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)