దేశవ్యాప్తంగా ఏపీ ‘పెట్టుబడుల’ సదస్సులు

Published on Fri, 02/03/2023 - 08:28

సాక్షి, అమరావతి: పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా విశాఖలో మార్చి నెలలో జరిగే గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సును విజయవంతం చేయడమే లక్ష్యంగా.. దేశవ్యాప్తంగా పెట్టుబడుల సన్నాహక సదస్సులను ఏపీ ప్రభుత్వం నిర్వహించబోతోంది. ఫిబ్రవరి 10 నుంచి 24 వరకు దేశంలోని 7 ప్రధాన నగరాల్లో రోడ్‌షోలు నిర్వహించేందుకు ఏపీ ఎకనామిక్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు ప్రణాళికలు రూపొందించింది. సీఎం జగన్‌ ఇటీవల ఢిల్లీలో ప్రారంభించిన గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సన్నాహక సదస్సు విజయవంతమవ్వడంతో.. అదే స్ఫూర్తితో ఈ రోడ్‌షోలను కూ డా నిర్వహించబోతోంది. 

ఫిబ్రవరి 10న త్రివేండ్రం, కోల్‌కతా, 14న బెంగళూరులో, 17న చెన్నై, అహ్మదాబాద్, 21న ముంబై, 24వ తేదీన హైదరాబాద్‌లో ఈ రోడ్‌షోలు నిర్వహించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశమున్న వనరులు, ప్రయోజనాలను వివరించడంతో పాటు ప్ర ధానంగా 13 రంగాల్లో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ఈ రోడ్‌ షోలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి పలు సంస్థలు ఇప్పటికే ఆసక్తిని వ్యక్తం చేశాయి. మార్చి 3–4 తేదీల్లో విశాఖ వేదికగా జరిగే గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సులో ఆ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడు లు పెడుతూ.. వాస్తవ ఒప్పందాలు చేసుకుంటా యని పరిశ్రమల శాఖ అధికారులు వెల్లడించారు.  

Videos

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)