Breaking News

ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ షెడ్యూల్‌ విడుదల

Published on Sun, 04/13/2025 - 04:53

సాక్షి, అమరావతి: అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్మిడియట్‌ బోర్డు విడుదల చేసింది. వచ్చేనెల 12 నుంచి 20 వరకు ఈ పరీక్షలు జరుగుతాయని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి 12 గంటలకు మొదటి ఏడాదికి, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు రెండో ఏడాది విద్యార్థులకు పరీక్షలు ఉంటాయి. ప్రాక్టికల్స్‌ మే 28 నుంచి జూన్‌ 1 వరకు నిర్వహించనున్నారు.  

22 వరకు రీకౌంటింగ్‌ ఫీజు చెల్లింపు 
ఇంటర్‌ జవాబు పత్రాల రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు బోర్డు అవకాశం కల్పించింది. అభ్యర్థులు నేటి నుంచి 22 వరకు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించవచ్చు. జవాబు పత్రాల రీ వెరిఫికేషన్‌కు రూ.1,300, రీ కౌంటింగ్‌కు రూ.260 ఫీజుగా పేర్కొన్నారు.  

సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజులు 
సప్లిమెంటరీ పరీక్షలకు ఈనెల 15 నుంచి 22 వరకు ఫీజు చెల్లించవచ్చని బోర్డు తెలిపింది. పేపర్ల సంఖ్యతో నిమిత్తం లేకుండా మొదటి లేదా రెండో ఏడాదికి రూ.600, ప్రాక్టికల్స్‌కు రూ.275 చెల్లించాలి. బ్రిడ్జి కోర్సుకు రూ.165, బ్రిడ్జి కోర్సు ప్రాక్టికల్స్‌కు రూ.275 చెల్లించాల్సి ఉంటుంది. ఇంటర్‌ రెండేళ్లకు కలిపి థియరీ పరీక్షలకు రూ.1,200, ఒకేషనల్‌ రెండేళ్ల ప్రాక్టికల్స్‌కు రూ.550, రెండేళ్ల బ్రిడ్జి కోర్సుకు రూ.330 చెల్లించాలి. 

ఇంప్రూవ్‌మెంట్‌కు... 
ఇంప్రూవ్‌మెంట్‌కు హాజరయ్యే విద్యార్థులు రూ.600 ఫీజుతో పాటు ప్రతి పేపర్‌కు అదనంగా రూ.160 చెల్లించాలి. మార్కుల పెంపునకు (బెటర్‌మెంట్‌) రెండేళ్లకు కలిపి ఆర్ట్స్‌ విద్యార్థులు రూ.1,350, సైన్స్‌ విద్యార్థులు రూ.1,600 చెల్లించాల్సి ఉంటుంది.    

చదువుకునే సమయం ఏది? 
ఈ ఏడాది పరీక్షలు ముగిసిన 10 రోజుల్లోనే విద్యా సంవత్సరం ప్రారంభించి తరగతులు నిర్వహిస్తున్న ఇంటర్‌ బోర్డు.. అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో అదే పంధాను అనుసరిస్తోంది. విద్యార్థులు పూర్తిగా తేరుకోకుండానే సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ ప్రకటించింది. సాధారణంగా ఈ పరీక్షలు మే చివరి వారంలో ప్రారంభమై జూన్‌ మొదటి వారంలో పూర్తి కావాల్సి ఉండగా, ఈసారి మే రెండో వారానికి మార్చారు. దీంతో విద్యార్థులు చదువుకునేందుకు సరైన సమయం లేకపోవడం గమనార్హం.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)