Breaking News

ఎన్టీఆర్ హెల్త్‌ యూనివర్సిటీపై ఆగ్రహం.. హైకోర్టు సంచలన తీర్పు

Published on Fri, 02/21/2025 - 21:31

సాక్షి, అమరావతి :  ఓ విద్యార్థినికి సీటు అంశానికి సంబంధించి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్‌ యూనివర్సిటీపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ హైకోర్టు.. సంచలన తీర్పును వెలువరించింది. ఎన్టీఆర్ యూనివర్సిటీ నిర్ణయం వల్ల నెల్లూరు జిల్లాకు చెందిన రేవూరు వెంకట అశ్రిత అనే విద్యార్థిని ఎంబీబీఎస్‌ సీటు కోల్పోయింది. ఇదే అంశంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. రేవూరి వెంకట అశ్రితకు నష్టపరిహారం కింద ఏడు లక్షల రూపాయలు ఎన్టీఆర్ యూనివర్సిటీ చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. రెండు నెలల్లో నష్ట పరిహారం విద్యార్థికి చెల్లించాలని తేల్చి చెప్పింది.  

అదే సమయంలో వెంకట ఆశ్రిత కన్నా తక్కువ మెరిట్ ఉన్న విద్యార్థికి సీటు కేటాయించడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఆశ్రిత కన్న తక్కువ మెరిట్ ఉన్న మరొకరికి సీటు కేటాయించడం చట్ట విరుద్ధమని వ్యాఖ్యానించింది. ఎక్కువ మెరిట్ ఉన్న ఆశ్రితకు ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం సీటు కేటాయించకుండా నిరాకరించినందుకు రూ.25000లను ఖర్చుల కింద   చెల్లించాలని పేర్కొంది. ఈ మొత్తాన్ని రెండు వారాల్లో అశ్వితకు చెల్లించాలని ఎన్టీఆర్ యూనివర్సిటీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)