Breaking News

పెద్దిరెడ్డికి 2+2 భద్రత కల్పించండి: హైకోర్టు ఆదేశం

Published on Mon, 07/08/2024 - 21:05

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి గతంలో మాదిరిగా యథాతధంగా 2+2 భద్రతను కల్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పెద్దిరెడ్డి ఎమ్మెల్యేగా రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్నారని ధర్మాసనం ప్రభుత్వానికి సూచించింది.

కాగా, గతంలో తనకు కల్పించిన భద్రతను యథాతధంగా కొనసాగించాలంటూ పెద్దిరెడ్డి.. హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు పెద్దిరెడ్డి పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రాణహాని నేపథ్యంలో పెద్దిరెడ్డికి  2+2 భద్రతను కల్పించాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.

ఇక, విచారణ సమయంలో.. ప్రాణహాని నేపథ్యంలో దీన్ని ప్రత్యేక కేసుగా పరిగణిస్తున్నట్టు కోర్టు స్పష్టం చేసింది. పెద్దిరెడ్డి ఎమ్మెల్యేగా రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్నారని గుర్తు చేస్తూ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మూడు వారాల పాటు లేదా ఎస్‌ఆర్‌సీ నివేదిక వచ్చేంత వరకు పెద్దిరెడ్డికి 2+2 భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం, తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

ఇదిలా ఉండగా.. ఎంఆర్‌పల్లిలో తమ భూముల్లో నిర్మించుకున్న నిర్మాణాల విషయంలో జోక్యం చేసుకోకుండా అధికారులను నియంత్రించాలని కోరుతూ పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ నేడు హైకోర్టులో విచారణకు వచ్చింది. ఇక, విచారణ సందర్భంగా పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు ఉన్న రోడ్డు, గేటు, ఇతర నిర్మాణాల విషయంలో ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని అధికారులను కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలోనే తదుపరి విచారణ ఈనెల 10వ తేదీకి వాయిదా వేసింది. 
 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)