Breaking News

హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు.. నిబంధనల పేరుతో ప్రభుత్వ డాక్టర్ల కాలయాపన

Published on Sat, 11/22/2025 - 11:59

సాక్షి, అమరావతి: ప్రభుత్వ  డాక్టర్లు నిబంధనల పేరుతో కాలయాపన  చేస్తున్నారని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. పబ్లిక్‌ సర్వెంట్లుగా నిర్వర్తించాల్సిన విధులను సక్రమంగా నిర్వర్తించడం లేదని పేర్కొంది. వివరాల్లోకి వెళితే  రాయపూడి గ్రామానికి చెందిన 90 ఏళ్ల శేషగిరమ్మకు చెందిన భూమిని సీఆర్‌డీఏ భూసేకరణలో తీసుకోగా.. ఆమెకు, మానసిక వైకల్యంతో బాధపడుతున్న మనుమరాలు శ్యామలకు జీవనోపాధి లేకుండా పోయింది. దీంతో ఇద్దరూ కారుణ్య మరణం కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. దీనిని విచారించిన న్యాయమూర్తి జస్టిస్‌ రామకృష్ణ ప్రసాద్‌  ప్రభుత్వ పథకం కింద ఆర్థిక సాయం అందించేందుకు శ్యామలకు ఎంత మేర మానసిక వైకల్యం ఉందో తేల్చాలని గతంలో వైద్యశాఖను ఆదేశించారు. 

శుక్రవారం విచారణలో శ్యామలకు 95 శాతం మానసిక వైకల్యం ఉందని సంబంధిత అధికారి నివేదించారు. అయితే, శారీరక వైకల్యం పరిస్థితి పరీక్షించలేదని చెప్పడంతో న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. శ్యామల ఇంటికి నిపుణులను పంపి పూర్తి పరీక్షలు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్‌ను  ఆదేశించారు.తదుపరి విచారణను డిసెంబర్‌ 1కి వాయిదా వేశారు.  కాగా, ఈ వ్యాజ్యంలో సీఆర్‌డీఏ తరఫు న్యాయవాది సింగమనేని ప్రణతి స్పందిస్తూ.. శేషగిరమ్మ, శ్యామల ప్రస్తుతం ఉంటున్న ఇల్లు, అక్కడి నిర్మాణాల విలువను అధికారులు రూ.6 లక్షలుగా అంచనా వేశారని, ఈ మొత్తానికి మరో రూ.6 లక్షలు కలిపి మొత్తం రూ.12 లక్షలు వారికి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. 

వారిద్దరిని అక్కడి నుంచి మరోచోటుకు తరలించిన పక్షంలో వారికి అక్కడ 5 సెంట్ల భూమిని కూడా ఇవ్వాలని కూడా నిర్ణయించామన్నారు. ఈ వ్యాజ్యంలో న్యాయమూర్తి  గతంలో స్వయంగా తన కారు డ్రైవర్‌ను ఇచ్చి అడ్వకేట్‌ కమిషనర్‌ను బాధితుల ఇంటికి పంపి వారి వివరాలు తెలుసుకున్న సంగతి తెలిసిందే.   

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)