Breaking News

ఏళ్ల తరబడి ఒకేచోట పనిచేయడం సరికాదు

Published on Sat, 12/06/2025 - 08:21

సాక్షి, అమరావతి: జీవిత భాగస్వామి పనిచేస్తున్న చోటే పోస్టింగ్‌ తీసుకుంటున్న కొందరు ప్రభుత్వ ఉద్యోగులు జీవితాంతం ఒక్క చోటే విధులు నిర్వర్తిస్తుండటంపై హైకోర్టు ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. అలాగే ఉద్యోగ సంఘాల నాయకులు కూడా ఆయా సంఘాల్లో తమ తమ హోదాలను సాకుగా చూపుతూ ఏళ్ల తరబడి ఒకే చోట పనిచేస్తున్నారని, ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. ఇలా కొందరు ఉద్యోగులు ఒకే చోట ఏళ్ల తరబడి పనిచేస్తూ ఆ స్థానాలకు రావాలనుకుంటున్న ఇతర ఉద్యోగులకు అడ్డంపడి పోతున్నారని తెలిపింది. 

ఈ వ్యవహారంపై లోతుగా విచారణ జరుపుతామని  తేల్చి చెప్పింది. ఈ రెండు కేటగిరిలకు మినహాయింపుల వెనుక ఉన్న హేతుబద్ధత ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇందుకు సంబంధించి నిబంధనలు, మార్గదర్శకాల వివరాలు తెలియచేయాలని శుక్రవారం ప్రభుత్వాన్ని ఆదేశించిన న్యాయమూర్తులు జస్టిస్‌ బట్టు దేవానంద్, జస్టిస్‌ అవధానం హరిహరనాథ శర్మ ధర్మాసనం.. తదుపరి విచారణను జనవరి మొదటి వారానికి వాయిదా వేసింది. 

హైకోర్టుకు చేరిన ఇద్దరు అధికారుల మధ్య వివాదం...
విజయనగరం జిల్లా సైనిక్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ (జెడ్‌ఎస్‌డబ్యూఓ)గా పనిచేస్తున్న మజ్జి కృష్ణారావును తూర్పు గోదావరి జిల్లా, కాకినాడకు బదిలీ చేశారు. కృష్ణారావు స్థానంలో కేవీఎస్‌ ప్రసాదరావును విజయనగరం జెడ్‌ఎస్‌డబ్యూఓగా నియమించారు. కృష్ణారావు కాకినాడలో బాధ్యతలు చేపట్టకుండా విజయనగరంలోనే ఉండటంతో వివాదం మొదలైంది. పైగా ఈ బదిలీపై హైకోర్టును ఆశ్రయించారు. 

విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి... పిటిషనర్‌ కృష్ణారావును విజయనగరంలో కొనసాగించే విషయంలో హోంశాఖ ముఖ్య కార్యదర్శి జారీ చేసిన సంబంధిత ప్రొసీడింగ్స్‌ అమలుకు చర్యలు తీసుకోవాలని సైనిక్‌ వెల్ఫేర్‌ డైరెక్టర్‌ను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ  ప్రసాదరావు ధర్మాసనం ముందు అప్పీల్‌ దాఖలు చేశారు.  

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)