Breaking News

జస్టిస్‌ ఎన్వీ రమణ వల్లే హైకోర్టు న్యాయమూర్తి అయ్యాను

Published on Fri, 01/09/2026 - 04:27

సాక్షి, అమరావతి: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ తల్లాప్రగడ మల్లికార్జునరావుకు హైకోర్టు ఘనంగా వీడ్కోలు పలికింది. జస్టిస్‌ మల్లికార్జునరావు ఈ నెల 18న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నెల 9 నుంచి హైకోర్టుకు సంక్రాంతి సెలవులు కావడం, 18వ తేదీ ఆదివారం కావడంతో హైకోర్టు ఆయనకు గురువారమే వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి న్యాయమూర్తులందరూ హాజరయ్యారు.  ఈ సందర్భంగా జస్టిస్‌ మల్లికార్జునరావు మాట్లాడుతూ, ‘జిల్లా జడ్జిగానే పదవీ విరమణ చేస్తానని నేను భావించా.

అయితే అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ వల్ల పరిస్థితులు మారాయి. నేను కూడా హైకోర్టు న్యాయమూర్తిని అయ్యాను’అని తెలిపారు. అంతకుముందు సీజే జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ మాట్లాడుతూ జస్టిస్‌ మల్లికార్జునరావు న్యాయాధికారిగా, న్యాయమూర్తిగా న్యాయవ్యవస్థకు ఎనలేని సేవలు అందించారన్నారు. అదనపు సొలిసిటర్‌ జనరల్‌ (ఏఎస్‌జీ) చల్లా ధనంజయ, అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్, హైకోర్టు న్యాయవాదుల సంఘం ఇన్‌చార్జ్‌ అధ్యక్షుడు కేవీ రఘువీర్‌లు జస్టిస్‌ మల్లికార్జునరావు సేవలను కొనియాడారు.  ఈ కార్యక్రమంలో జస్టిస్‌ మల్లికార్జునరావు కుటుంబ సభ్యులు, అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏఏజీ) ఇవన సాంబశివ ప్రతాప్, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (పీపీ) మెండ లక్ష్మీనారాయణ, డిప్యూటీ సొలిసిటర్‌ జనరల్‌ (డీఎస్‌జీ) పసల పొన్నారావు, హైకోర్టు న్యాయవాదులు, రిజి్రస్టార్లు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. 

హైకోర్టు న్యాయవాదుల సంఘం ఘన సన్మానం 
అనంతరం జరిగిన కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాదుల సంఘం జస్టిస్‌ మల్లికార్జునరావు దంపతులను ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి చేజర్ల సుబోధ్, ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)